Advertisement
Google Ads BL

బాలయ్యతో దిల్ రాజు ప్లాన్ చేస్తుంది ఇదేనా?


హిందీలో పింక్ అనే సినిమా రీసెంట్‌గా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అమితాబ్ అండ్ తాప్సీ నటించిన ఈ సినిమాను తమిళంలో అజిత్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు దృష్టి పడింది. కొన్ని రోజుల కిందట ఈ సినిమాను చూసిన దిల్ రాజు దీన్ని తెలుగులోకి రీమేక్ చేయాలని చూస్తున్నాడు. అందుకు సంబంధించిన రైట్స్ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది.

Advertisement
CJ Advs

అయితే తెలుగులో ఎవరు చేస్తారు అనే ప్రశ్నకు దిల్ రాజు దగ్గర జవాబు కూడా ఉంది. అన్ని కుదిరితే ఈసినిమాలో బాలకృష్ణ చేసే అవకాశముంది. దిల్ రాజు సంకల్పం కూడా అదే. టాలీవుడ్‌లో దాదాపు అందరి హీరోస్‌తో పని చేసిన అనుభవం ఉన్న దిల్ రాజు.. చిరు, బాలయ్యలతో మాత్రం చేయలేదు. ఈ సినిమా ఒకవేళ బాలయ్య ఒప్పుకుంటే బాలయ్యతో చేయలేదే అనే లోటు కూడా దిల్ రాజుకు తీరిపోతుంది. పైగా ఇది బాలయ్యకి సరైన సబ్జెక్ట్.

దిల్ రాజు దీనికి టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. ‘లాయర్ సాబ్’ అన్నది టైటిల్. బాలయ్య ఓకే అనడమే ఆలస్యం. వెంటనే అనౌన్స్‌మెంట్ వస్తుంది అలానే స్టోరీ కూడా చకచకా రెడీ అయిపోతుంది. కాకపోతే డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు.

Dil Raju and Balakrishna Combo Movie Details:

Dil Raju Plans Pink Remake with Balakrishna
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs