Advertisement
Google Ads BL

‘రాక్షసుడు’, ‘గుణ 369’ టాక్ ఏంటంటే..?


గతవారం విడుదలైన విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సో సో టాక్ తో సో సో కలెక్షన్స్ తో పెట్టిన పెట్టుబడి తెచ్చుకోలేక నానా ఇబ్బందులు పడుతుంది. ఈలోపు నిన్న శుక్రవారం బెల్లంకొండ శ్రీనివాస్ -రమేష్ వర్మల ‘రాక్షసుడు’, అర్జున్ జంధ్యాల - కార్తికేయ కాంబోలో తెరకెక్కిన ‘గుణ 369’ సినిమాలు బాక్సాఫీస్ వద్దకు వచ్చేసాయి. రాక్షసుడు, గుణ 369 మీద ఒకేలాంటి అంచనాలున్నాయి. ఐదారు సినిమాలు చేసినా సూపర్ హిట్ కొట్టని బెల్లంకొండ, మొదటి సినిమాతో హిట్ అనిపించుకుని నెక్స్ట్ సినిమాతో భారీ డిజాస్టర్ కొట్టిన కార్తికేయ ఇద్దరు ఒకేలాంటి అంచనాలతో బాక్సాఫీసు వద్ద తలపడ్డారు. అయితే బెల్లంకొండ రాక్షసుడు సినిమాకి పాజిటివ్ అండ్ హిట్ టాక్ పడగా.. కార్తికేయ గుణ 369 కి యావరేజ్ టాక్ పడింది.

Advertisement
CJ Advs

తమిళ హిట్ మూవీ రట్చసన్ ని తెలుగులో రాక్షసుడుగా రీమేక్ చేసి హిట్ కొట్టాడు బెల్లంకొండ శ్రీనివాస్. రాక్షసుడు సినిమాలో కథ, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం, పాత్రల తీరుతెన్నులు బలాలు. నిడివి ఎక్కువ కావడం, కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం బలహీనతలు. ఇక కార్తికేయ గుణ 369 సినిమాకి నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ, కార్తికేయ నటన బలాలైతే... పాటలు, నిర్మాణ విలువలు, కథ, కథనం, ఎడిటింగ్ లాంటివి బలహీనతలు. 

ఇక రివ్యూ రైటర్స్ బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు సినిమాకి హిట్ రేటింగ్స్ ఇచ్చారు. ఇక కార్తికేయ గుణ 369 కి యావరేజ్ రేటింగ్స్ తోనే సరిపెట్టేసారు. అర్జున్ జంధ్యాల దర్శకత్వానికి కొత్త కావడం, కథనంలో వీక్ వలన గుణ 369కి యావరేజ్ టాక్ పడింది. ఇక ప్రేక్షకులు ఫైనల్‌గా ఈ రెండు సినిమాల్లో రాక్షసుడు సినిమాకే ఓటేసినట్లుగా కనబడుతుంది.

Talk about Rakshasudu and Guna 369 Movie :

Rakshasudu gets Hit and Guna 369 Average at Box Office
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs