Advertisement

మొత్తానికి బెల్లంకొండ బాబు కొట్టాడు హిట్..!


ఇప్పటివరకు భారీ బడ్జెట్స్‌తో, స్టార్ హీరోయిన్స్‌తో సినిమాలు చేసే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈసారి తక్కువ బడ్జెట్‌తో సేఫ్ గేమ్ ఆడాలనుకున్నాడు. ఎప్పుడూ రిచ్‌గా సినిమాలు చేస్తున్న శ్రీనివాస్ కి హిట్ అనే పదం అందని కలగానే మిగిలిపోయింది. అల్లుడు శీను, స్పీడున్నోడు, జయ జానకి నాయక, కవచం, సాక్ష్యం, సీత ఇలా అన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలే. అందులోను టాప్ హీరోయిన్స్‌తో రొమాన్స్ చేసినా మనోడికి ఫేమ్ రాలేదు. ఇక లాభంలేదనుకున్న బెల్లంకొండ ఈసారి ఓ హిట్ రీమేక్‌నే నమ్ముకున్నాడు. తమిళనాట క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కి సూపర్ హిట్ కొట్టిన రట్చాసన్ సినిమాని తెలుగులో రాక్షసుడుగా రీమేక్ చేసాడు. ఈ సినిమా తక్కువ బడ్జెట్‌తోనే రూపుదిద్దుకుంది.

Advertisement

ఇక దర్శకుడు రమేష్ వర్మ కూడా లో బడ్జెట్ లో తమిళ రట్చాసన్‌ని యాజిటీజ్ గా తెలుగులోకి కాపీ పేస్ట్ చేసాడు. నిన్న వరల్డ్ వైడ్ గా విడుదలైన రాక్షసుడు సినిమాకి మొదటి షోకే హిట్ టాక్ పడింది. తమిళ రట్చాసన్ గనక వీక్షించని ప్రేక్షకులకు తెలుగు రాక్షసుడు ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే మాతృకని ఎక్కడా చెడగొట్టకుండా రమేష్ వర్మ ఈ రీమేక్ కంప్లీట్ చేసాడు. సినిమాలో బెల్లకొండ పోలీస్ ఆఫీసర్‌గా ఆకట్టుకోవడమే కాదు... ఎమోషనల్ సీన్స్ లోను మంచి నటన కనబర్చాడు. 

ఇక సినిమాకి మరో మెయిన్ హైలెట్ కథ. అలాగే జిబ్రాన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ప్రాణం. ఇంకా సినిమాటోగ్రఫీ ఇలా చాలా ప్లస్ పాయింట్స్ తో రాక్షసుడు సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చేసింది. ప్రేక్షకులే కాదు, రివ్యూ రైటర్స్ కూడా సినిమాకి మంచి మార్కులేసేసారు. ఇక రాక్షసుడు సినిమా.. 9న విడుదలకాబోతున్న నాగార్జున మన్మథుడు 2 వచ్చేవరకు కలెక్షన్స్ దున్నేసుకోవడమే. మరి డైరెక్ట్ గా చేసిన సినిమాలకన్నా ఓ రీమేక్ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్‌నే మార్చేసింది. మరి ఈ విజయాన్ని అతను ఎంతవరకు నిలబెట్టుకుంటాడో చూద్దాం.

Rakshasudu Movie Gets Hit Talk:

Bellamkonda srinivas gets hit with Rakshasudu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement