Advertisement

వైరల్ అవుతున్న రామ్ చరణ్ తాజా లుక్


రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ ల కలయికలో బడా మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న RRR షూటింగ్ యమా స్పీడుగా సాగుతుంది. మొన్నటివరకు హీరోల గాయాలతో RRR షూటింగ్ కి కాస్త గ్యాప్ ఇచ్చిన రాజమౌళి ఇప్పుడు మాత్రం షూటింగ్ చిత్రీకరణ శరవేగంగా జరుపుతున్నాడు. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలోనూ, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలోనూ నటిస్తున్న RRR  మూవీ ఫస్ట్ లుక్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల పూర్తి లుక్స్ రివీల్ చెయ్యకుండా జస్ట్ హాఫ్ పేస్ లను మాత్రమే రివీల్ చేస్తూ నీరు, నిప్పుగా పరిచయం చేశారు. 

Advertisement

ఇక తర్వాత హీరోలు పూర్తి లుక్ గురించి సోషల్ మీడియాలో అభిమానులు తరుచు హడావిడి చేస్తున్నారు కానీ.. రాజమౌళి మాత్రం హీరోల లుక్స్ ని పరిచయం చెయ్యడం లేదు. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఈ సినిమా కోసం స్పెషల్ మేకోవర్ ఏమన్నా అయ్యారంటే వారు ఎప్పుడు బయట కనబడినా సాదాసీదా లుక్స్ లోనే కనిపిస్తున్నారు.

అయితే తాజాగా రామ్ చరణ్ అల్లూరి లుక్ కాస్త లీక్ అయినట్లే అనబడుతుంది. రెండు రోజుల క్రితం చరణ్ తో కలిసి వినయ విధేయరామలో హీరోయిన్ గా నటించిన కియారా అద్వానీ పుట్టినరోజు వేడుకలకు ముంబై వెళ్లిన రామ్ చరణ్ తాజా లుక్ ఆసక్తికరంగా ఉంది. బాగా మెలితిప్పిన మీసంలో రామ్ చరణ్ రఫ్ లుక్ లో చాలా బాగున్నాడు. మరి అల్లూరి సీత రామరాజు మీసకట్టు ఇలానే ఉంటుందనేది అందరికి తెలుసు. అందుకే చరణ్ ని అలాంటి మీసకట్టులో చూసిన మెగా ఫ్యాన్స్ అల్లూరి సీతారామరాజు లుక్ లో రామ్ చరణ్ కనిపిస్తున్నట్టుగా ఫీలవుతున్నారు. ఇక ముంబైలో కియారా బర్త్ డే వేడుకలకు హాజరైన చరణ్ అటునుంచటే RRR షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.

Ram Charan Latest Look Viral in Social Media:

Ram Charan at Kiara Adwani Birthday Celebrations
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement