టైటిల్ చూడగానే ఇదేంటి.. మొన్నేగా బిగ్‌బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిపోయింది.. మరి ఈ ఇద్దరు ఎంట్రీ ఎలా సాధ్యమవుతుంది అనుకుంటున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే.. ఈ ఇద్దరూ ఎంట్రీ ఇస్తున్నారు అయితే మీరు అనుకుంటున్నట్లుగా కంటెస్టెంట్లుగా మాత్రం కాదు.. అదేనండి సినిమా ప్రమోషన్స్ కోసమే.
సినిమా ప్రమోషన్స్ కోసం ఏ చిన్నపాటి అవకాశాన్ని కూడా ఇప్పటి పరిస్థితుల్లో ఏ చిత్రబృందం వదులుకోవట్లేదు. అందుకే అందరూ ఆదరించే.. టీఆర్పీ రేటింగ్ ఓ రేంజ్‌లో వస్తున్న బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి తమ సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు ఇటు రకుల్ ప్రీత్ సింగ్... జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ సిద్దమయ్యారు.
అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన ‘మన్మథుడు 2’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా రకుల్ హౌస్‌లోకి రానుంది. కాగా ఆమెతో పాటు డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కూడా ఎంటరవుతాడని టాక్. ఆగస్టు 9న ‘మన్మథుడు 2’ థియేటర్లలోకి వచ్చేస్తున్నాడు.
ఇక సుడిగాలి సుధీర్ విషయానికొస్తే.. బుల్లి తెరపై తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్.. సిల్వర్ స్క్రీన్‌పై ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ అనే టైటిల్‌తో హీరోగా వస్తున్నాడు. అతి త్వరలోనే ఈ పెద్ద పెద్ద సినిమాలన్నీ అయిపోయాక సుధీర్ థియేటర్లలోకి రావాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో బిగ్‌బాస్ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రమోషన్స్ షురూ చేస్తున్నాడు. అయితే ‘మన్మథుడు’, ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ టీమ్ ఎప్పుడు హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తుందనే విషయం మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.