Advertisement
Google Ads BL

బన్నీ-సుకుమార్ సినిమా స్టోరీ లీకైపోయిందిగా!


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత నటీనటులుగా సుకుమార్ తెరకెక్కించిన ‘రంగస్థలం’ కనివినీ ఎరుగని రీతిలో విజయం నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. 2018 గ్యాప్ తర్వాత తన తదుపరి చిత్రాన్ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బన్నీతో ఖారారైంది. అయితే ఇప్పటి వరకూ ఈ కాంబోలో వస్తున్న చిత్రంపై ఎలాంటి అప్డేట్ రాకపోగా.. తాజాగా ఏకంగా సినిమాలో బన్నీ పాత్రతో పాటు.. స్టోరీ, షూటింగ్ స్పాట్‌లు కూడా ఎక్కడనేది లీకైపోయింది.

Advertisement
CJ Advs

గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందనేది తాజాగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇందులో బన్నీ స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఓ కీలక పాత్రలో (పోలీస్.. ఉద్యమకారుడు అనేది తెలియరాలేదు) నటించబోతున్నారని సమాచారం. ఇక షూటింగ్ విషయానికొస్తే.. సౌత్ ఇండియాలోని దట్టమైన అడవుల్లో గట్టిగానే ప్లాన్ చేశారట. అయితే ఇండస్ట్రీకి చెందిన కొందరు సన్నిహితుల ద్వారా ఈ లీకులు బయటికి పొక్కాయని తెలుస్తోంది. మొత్తానికి చూస్తే నాడు వీరప్పన్ సినిమాకు పూర్తిగా విరుద్దంగా ఉండబోతోందన్న మాట.

కాగా.. ఈ చిత్రంలో బన్నీ సరసన ఫస్ట్ టైమ్ రష్మిక మందన్నాను తీసుకోవడం జరిగింది. మరోవైపు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించబోతున్నాడు. ఇవన్నీ అటుంచితే మైత్రీ మూవీ మేకర్స్  ఈచిత్రాన్ని నిర్మిస్తుండటంతో బన్నీ ఫ్యాన్స్‌లో ఎక్కడలేని ధీమా వచ్చేసింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను షురూ చేయాలని చిత్రబృందం భావిస్తోందట.

Allu Arjun-Sukumar Film Backdrop Revealed:

Allu Arjun-Sukumar Film Backdrop Revealed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs