Advertisement
Google Ads BL

పవన్ పేరును లేడీ ఫ్యాన్ అక్కడ వేయించుకుంది!


టాలీవుడ్ స్టార్ హీరో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏ రేంజ్‌లో అభిమానులు ఏ రేంజ్‌లో ఉన్నారో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా పవన్‌కు ఫ్యాన్స్‌ ఉన్నారన్న విషయం విదితమే. అయితే ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొందరు ఫ్యాన్స్ తగ్గగా.. కొత్తవాళ్లకు మాత్రం కొదువలేకుండా పోయింది. మరీ ముఖ్యంగా పవన్ అభిమానించే లేడీ ఫ్యాన్స్ గట్టిగానే ఉన్నారు.

Advertisement
CJ Advs

ఇక అసలు విషయానికొస్తే.. తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-3 హౌస్‌లో ప్రస్తుతం పవన్ అంటే పడి చచ్చే ఇద్దరూ లేడీ ఫ్యాన్స్ ఉన్నారు. వారెవరో కాదు.. ఒకరు శ్రీముఖి కాగా మరొకరు అషురెడ్డి. హాట్ యాంకర్ కమ్ నటి శ్రీముఖిని పరిచయం చేయనక్కర్లేదు. అషు రెడ్డి సోషల్ మీడియాను ఊపేసిన డబ్‌స్మాష్ ద్వారా అచ్చంగా ‘సమంత’లాగా ఉన్న ఈ భామ బాగా పాపులరైంది. డబ్ స్మాష్ ద్వారా అతి తక్కువ వ్యవధిలోనే సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోయింది. ఇప్పుడు అదే ఫేమ్‌తో బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కూడా.

అషురెడ్డికి పవన్ అంటే ప్రాణమట.. ఈ విషయం ఆమె బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత బయటపడింది. అంతేకాదు.. తన ఎదపైన ‘పవన్’ పేరుతో ఉన్న పచ్చబొట్టును సైతం ఆమె సన్నిహితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంటే.. పరోక్షంగా అషుకు పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తల ఆశీర్వాదం కావాలని అడుగుతున్నారన్న మాట. ఇప్పటికే బిగ్‌బాస్ సీజన్-1, 2 లో ఇద్దరూ పవన్ భక్తులే గెలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అషు గెలవాలని విశ్వప్రయత్నాలు ఇటు హౌస్ బయటి నుంచి మిత్రులతో.. అటు హౌస్‌లో తోటి కంటెస్టెంట్లతో గట్టిగానే పోరాటం చేస్తోంది. చివరికి ఫలితం ఎలా ఉంటుందో ఏంటో మరి.

bigg boss-3 lady contestent spotted pawan kalyan tattoo on her body:

bigg boss-3 lady contestent spotted pawan kalyan tattoo on her body  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs