Advertisement
Google Ads BL

‘రాక్షసుడు’ కథే హీరో: బెల్లంకొండ శ్రీనివాస్


ప్రేక్ష‌కుల‌ను మెప్పించే ఇన్‌టెన్సివ్ థ్రిల్ల‌ర్ ‘రాక్ష‌సుడు’ - బెల్లంకొండ శ్రీనివాస్‌

Advertisement
CJ Advs

డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ కథానాయకుడిగా ‘రైడ్‌’, ‘వీర’ చిత్రాల దర్శకుడు రమేష్‌వర్మ పెన్మత్స దర్శకత్వంలో ఎ హవీష్‌ లక్ష్మణ్‌ కొనేరు ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ప్రముఖ విద్యావేత్త కొనేరు సత్యనారాయణ నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘రాక్షసుడు’. అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్‌2న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ ఇంటర్వ్యూ.... 

‘రాక్షసుడు’ చేసిన అనుభవం ఎలా ఉంది? 

- మామూలుగా సినిమా మొదలుపెట్టిన తర్వాత సాయంత్రం ఆరు గంటలకు ప్యాకప్‌ అయిపోతే నేను సినిమా నుండి డిటాచ్‌ అవుతా. కానీ ఈ సినిమా విషయంలో నేను డిటాచ్‌ కాలేకపోయాను. ఎక్కడ చూసినా పత్రికల్లో మా సినిమాలో జరిగిన ఘటనలకు రిలేట్‌ అయ్యే ఇంటర్వ్యూలే కనిపించేవి. మామూలుగా అయితే వాటిని మనం పెద్దగా పట్టించుకోం. కానీ ఈ సినిమాతో అవి నాకు చాలా కనెక్ట్‌ అయ్యాయి. 

పోలీస్‌ ఆఫీసర్‌గా సెకండ్‌ టైమ్‌ నటించడం ఎలా అనిపిస్తోంది? 

- నేను పోలీస్‌ ఆఫీసర్‌గా ‘కవచం’ చేశాను కానీ, ఎక్కడో ప్రేక్షకులకు అంతగా కనెక్ట్‌ కాలేదు. కానీ ఈ సారి పోలీస్‌ ఆఫీసర్‌గా చేయడం నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో యాక్షన్‌ లేదు, పాటలు, డ్యాన్సులూ లేవు. డిఫరెంట్‌గా ఉంటుంది. ఇందులో నా మరదలి పాత్రకు దారుణం జరుగుతుంది. అలాంటి దారుణాన్ని ఇంట్లో వాళ్లకు జరిగినట్టు కూడా మనం ఊహించుకోలేం. నేను కూడా మా ఇంట్లో కొందరు అమ్మాయిలను నా చేతుల మీదుగా పెంచా. అలాంటివారి విషయంలో ఇలా జరిగితే నేను తట్టుకోలేను. అందుకే అదంతా మనసుకు బాగా కనెక్ట్‌ అయింది. అందుకే సినిమాతో డిటాచ్‌ కాలేకపోయా. 

రాక్షసుడు ఎలా ఉంటుంది? 

- ఇన్వెస్టిగేటివ్‌ కాప్‌ స్టోరీగా ఉంటుంది. ఓ విషయంలో ఒకడు రాక్షసుడిగా ప్రవర్తిస్తుంటాడు? వాడు ఎవరు? ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు? వాడిని సీఐ ఎలా పట్టుకున్నాడనేదే కథ. చాలా ఇంటెన్సివ్‌గా సాగే థ్రిల్లర్‌. 

రమేష్ వర్మ లాంటి కొత్త దర్శకుడితో మూవీ ఎలా అనిపించింది?

- కొత్త దర్శకుడు అనికాదు, ఈ చిత్రంలో కథే హీరో. అది నమ్మి చేయడం జరిగింది.

ఈ సినిమాలో నెగటివిటీ ఎక్కువగా ఉన్నట్లుంది? 

- దాన్ని పూర్తిగా నెగటివిటీ అని అనలేం కానీ, అంత ఇంటెన్సిటీ మాత్రం ఉంటుంది. మామూలుగా నేను నెగటివిటీకి దూరంగానే ఉంటాను. ఎక్కడ పాజిటివ్‌ వాతావరణం ఉంటే, అక్కడ నేనుంటాను. 

పరిశ్రమకు వచ్చిన ఐదేళ్ల తర్వాత ‘ఇదే నా మొదటి సినిమా’ అని చెప్పారు? 

- ఇన్ని రోజులు నేను మా దర్శకులు ఏం చెబితే అదే చేశా. నాకోసం ‘ఇంకో టేక్‌ చేద్దాం సార్‌’ అని కూడా ఎవరితోనూ అనలేదు. కానీ ఈ సినిమాకు ఆ స్వాతంత్రం వచ్చింది. అందువల్ల ఇంకా ఎక్కువ బాగా చేయగలిగాను. 85 రోజులు షూటింగ్‌ చేశా. నిర్విరామంగా ఆదివారం, సెలువులు లేకుండా పనిచేశా. ఎక్కువగా నైట్‌ షూటింగ్‌లు జరిగాయి. అందుకే అలా ఫీలయ్యా. 

ఇంతకు ముందువాటిని తక్కువ చేసిన భావన కలగలేదా? 

- అలా ఏమీ అనిపించలేదు. ఎందుకంటే నా ప్రతి సినిమాకూ నేను ప్రాణం పెట్టి పనిచేస్తాను. గత ఏడాది జూలై నుంచి ఈ జూలై వరకు మూడు సినిమాలు విడుదలయ్యాయి అని అంటే... అవి చిన్న చిత్రాలైతే ఫర్వాలేదు కానీ, అవి పెద్ద చిత్రాలు. వాటిని చేయడం అంత మామూలు విషయం కాదు. 

రెండోసారి రీమేక్‌ చేస్తున్నారు. కష్టంగా ఏమైనా అనిపించిందా? 

- అలా ఏమీ అనిపించలేదు. రీమేక్‌ ఎప్పుడూ 90 శాతం ఈజీగానే ఉంటుంది. 10 శాతం కష్టంగా ఉంటుంది. ఆ కష్టం కూడా కంపేరిజన్‌ వస్తుందనే తప్ప మిగతాది ఈజీగానే ఉంటుంది. 

సినిమా చూశారా? నచ్చిందా? 

- నా ఫ్రెండ్స్‌ తో కలిసి చూశాను. నాతో పాటు నా ఫ్రెండ్స్‌కి కూడా నచ్చింది. రియల్‌ కాప్‌గా ఉన్నానని అన్నారు. మా ఇంట్లో వాళ్లు కూడా చూశారు. వారికి కూడా బాగా నచ్చింది. 

మాస్‌ సినిమాలకు దూరంగా వెళ్తున్న భావన కలగడం లేదా? 

- డ్యాన్సులు, ఫైట్లు మిస్‌ అవుతున్న ఫీలింగ్‌ నాక్కూడా ఉంది. ఈ కథలో వాటిని జోడిస్తే ఆడియన్స్‌కి ఆ ఫీల్‌ మిస్సవుతుంది. అందుకనే తమిళ వెర్షన్‌కి సాధ్యమైనన్ని తక్కువ మార్పులు చేశాం. 

ఈ చిత్రం తరువాత కమర్షియల్ మూవీస్ చేస్తారా లేక కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలు చేస్తారా?

- నెక్స్ట్ కమర్షియల్ మూవీనే చేయాలని ఆలోచన ఉంది. ఆ కమర్షియల్ చిత్రాలలో ఉండే డాన్స్ లు ఫైట్లు మిస్ అవుతున్నాను (నవ్వుతూ)

మీ నాన్న ఏమంటున్నారు? 

- ఆయన పూర్తిగా కమర్షియల్‌ ప్రొడ్యూసర్‌. ఎక్కడ సక్సెస్‌ ఉంటే, ఆ కాంబినేషన్‌లో సినిమా చేయడానికి ఇష్టపడతారు.

Bellamkonda Sai Srinivas Interview:

Bellamkonda Sai Srinivas Talks about Rakshasudu Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs