Advertisement
Google Ads BL

‘జార్జిరెడ్డి’ ఫస్ట్ లుక్ వదిలారు


జార్జిరెడ్డి...దశాబ్ధాల క్రితం విద్యార్థి విప్లవోద్యమ నాయకుడుగా చరిత్రలో నిలిచిపోయిన పేరు. ధైర్యానికి, సాహసానికి ప్రతీకగా నిలిచిన పేరు అది. సమసమాజ స్థాపనే ధ్యేయంగా సాగిన జార్జిరెడ్డి ప్రస్థానం నేటికీ ఎన్నో విద్యార్థి ఉద్యమాలకు ఆదర్శంగా నిలుస్తోంది. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో చదువుతూ.. విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడుగా ఎదిగిన జార్జిరెడ్డిని చాలా చిన్న వయసులోనే కొందరు ప్రత్యర్థులు క్యాంపస్ లోనే హత్య చేశారు.. నేటి తరంలో చాలా మందికి తెలియని వ్యక్తి జార్జి. ఎందరో  విద్యార్థులను కదిలించిన వ్యక్తి,  అలాంటి ఆదర్శనీయమైన విద్యార్థి నేత జీవితం వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది.

Advertisement
CJ Advs

గతంలో ‘దళం’ సినిమాతో విభిన్నమైన దర్శకుడిగా పేరుతెచ్చుకున్న జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు.. ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేసింది ఈ సినిమా యూనిట్. ఈ లుక్ లో జార్జిరెడ్డి సినిమా బయోపిక్ అయినా కమర్షియల్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. ఒక కమర్షియల్ హీరో తెరమీద చేసే సాహసాలన్నీజార్జి నిజజీవితంలో చేసినట్టు ఈ లుక్ ను చూస్తే అర్థమవుతుంది. చరిత్ర మరిచిపోయిన లీడర్ అనే విషయాన్ని పోస్టర్ లోనే చెప్పారు. 1965 నుంచి 1975 వరకు ఉస్మానియా యూనివర్సీటీలో చదువుకున్న ప్రతీ విద్యార్థికి జార్జి జీవితం గురించి తెలుసు. కానీ ఈ తరానికి జార్జి లాంటి టెర్రిఫిక్ లీడర్ గురించి తెలుసుకునే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. మొత్తంగా ఓ ఫర్ గాటెన్ లీడర్ కథను తీసుకువస్తోన్న ఈ టీమ్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఒక్కసారిగా సినిమాపై ఆసక్తిని పెంచింది. 1960, 70లలో రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను కళ్ళకు కట్టబోతున్న ఈ సినిమాను మైక్ మూవీస్ బ్యానర్ తో కలిసి త్రీ లైన్స్, ‘‘సిల్లీ మాంక్స్ స్టూడియో’’ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘‘వంగవీటి’’ ఫేం సందీప్ మాధవ్ (సాండి) ఈ సినిమాలో లీడ్

రోల్ పోషిస్తుండగా, మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, శత్రు, తిరువీర్, అభయ్, ముస్కాన్, మహాతి ఇతర నటీనటులు. ప్రముఖ హీరో సత్య దేవ్ కూడా ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నారు. ప్రముఖ మరాఠీ నటి దేవిక ‘‘జార్జిరెడ్డి’’ తల్లి పాత్రలో నటిస్తుండటం విశేషం. సాంకేతికవర్గం విషయానికి వస్తే. సంచలనాత్మక మరాఠి సినిమా ‘‘సైరాత్’’ కు ఫొటోగ్రఫీని, ఇటీవల మరాఠి బ్లాక్ బస్టర్ ‘‘నాల్’’ కు దర్శకత్వం వహించిన సుధాకర్ యెక్కంటి ఈ సినిమాకు ఫొటోగ్రఫిని అందించారు. ఈ చిత్రాన్ని మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి సిల్లీ మంక్స్, త్రీ లైన్స్ సినిమా బ్యానర్లతో కలిసి నిర్మిస్తున్నారు. సంజయ్ రెడ్డి కో ప్రొడ్యూసర్ గా, దాము రెడ్డి, సుధాకర్ యెక్కంటిలు అసోసియేటెడ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్టుప్రొడక్షన్ జరుపుకుంటుంది.

సంగీతం -సురేష్ బొబ్బిలి, ఎడిటింగ్- ప్రతాప్ కుమార్, ఆర్ట్- గాంధీ నడికుడికార్, కాస్టూమ్స్- సంజనా శ్రీనివాస్, ఫైట్స్ -గణేష్, ఆర్కే, అసిస్టెంట్ రైటర్స్- యాకుబ్ అలీ, అనిల్, స్టిల్స్ -వికాస్ సీగు, సౌండ్ డిజైన్-ఖలీష, బ్యాక్ గ్రౌండ్ స్కోర్- అర్జిత్ దత్త. కో డైరెక్టర్ -నరసింహారావు, రచన ధర్శకత్వం- జీవన్ రెడ్డి.

George Reddy Movie First Look Released:

George Reddy Movie Latest Update 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs