Advertisement
Google Ads BL

రానా కోసం ఆగలేక సాయిపల్లవితో..


డైరెక్టర్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విరాటపర్వం’ అనే సినిమాలో రానా - సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా ఫైనల్ అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో ఫిక్స్ అయింది. ఇద్దరి డేట్స్ కూడా మ్యాచ్ చేసి షూటింగ్‌కి రెడీ అవుతున్న టైములో రానా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ ఆపరేషన్‌ కోసం విదేశాలకి వెళ్లాల్సి వచ్చింది. దీంతో షూటింగ్ ఆపాల్సివచ్చింది.

Advertisement
CJ Advs

ఈ చిత్రానికి సాయి పల్లవి ఇచ్చిన డేట్స్ ఎక్కడ వేస్ట్ అవుతాయో అని ప్రస్తుతం చిత్రయూనిట్ ఆమెపై సోలో సీన్స్‌ని షూట్ చేస్తున్నారట. ఎందుకంటే డేట్స్ మిస్ అయితే సాయి పల్లవి మళ్లీ దొరకదు. శేఖర్‌ కమ్ముల - చైతు సినిమాతో బిజీ అయిపోతుంది కాబట్టి ఇప్పుడే హీరో కాంబినేషన్‌లో లేని సీన్లు మొత్తం లాగించేస్తున్నారని సమాచారం.

రానా తన ట్రీట్మెంట్ అనంతరం షూటింగ్‌లో జాయిన్ అయినప్పుడు సాయిపల్లవి బిజీబిజీగా ఉంటుందట. శేఖర్‌ కమ్ముల చిత్రానికి గ్యాప్‌ వచ్చినపుడే మళ్లీ ఈ చిత్రానికి డేట్స్‌ ఇస్తుందట. అందుకే ఆమె సోలోగా కనిపించే అన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. 

Virataparvam Movie Shooting Starts with Sai Pallavi:

Without Rana.. Virataparvam Movie Shooting started
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs