‘గీత గోవిందం’ తర్వాత డైరెక్టర్ పరశురామ్ ఇంతవరకు తన నెక్స్ట్ సినిమా ఏంటో క్లారిటీ ఇవ్వలేదు. మహేష్‌తో కానీ, విజయ్ దేవరకొండతో కానీ పరశురామ్ సినిమా చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి కానీ దీనిపై పరశురామ్ మాత్రం క్లారిటీ లేదు. పరశురామ్.. మహేశ్‌కి ఒక లైన్ చెప్పినట్లు.. లైన్ విన్న మహేశ్, ఫుల్ స్క్రిప్ట్‌తో రమ్మని చెప్పినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి.
కానీ పరశురామ్ మహేష్ కోసం స్క్రిప్ట్ మొత్తం రెడీ చేసినప్పటికీ విజయ్‌తో ఈలోపు ఒక సినిమా చేద్దాం అని చూస్తున్నాడట. కానీ ఇందులో కూడా నిజం లేదని తెలుస్తుంది. ప్రస్తుతం పరశురామ్ పెద్ద హీరోలకు కథ చెప్పే పనిలో ఉన్నాడని.. తన కథకు ఏ హీరో ఓకే అంటే.. ఆ హీరోతోనే తన తరువాత సినిమా ఉంటుందని అతని సన్నిహితవర్గాల ద్వారా అందుతున్న సమాచారం. గీత గోవిందంతో బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురామ్ ఎందుకో ఇంత టైం తీసుకుంటున్నాడు సినిమా చేయడానికి. ‘గీత గోవిందం’ పరశురామ్ పాలిట వరమా.. శాపమా అనే డిస్కషన్ష్ కూడా ఫిల్మ్‌నగర్‌లో సంచరిస్తున్నాయి. సో.. ఇటువంటి వాటన్నిటికి చెక్ పెట్టేలా.. ఏ స్టార్ హీరోతో పరశురామ్ తన తర్వాత సినిమా ప్రకటిస్తాడో.. చూద్దాం.