Advertisement
Google Ads BL

కామ్రేడ్ అనుకుంటే ఇస్మార్టే తొక్కేస్తున్నాడు


భారీ ప్రమోషన్స్‌తో భారీ హైప్‌తో ఏకంగా నాలుగు భాషల్లో ఎంతో గ్రాండ్‌గా విడుదలైన డియర్ కామ్రేడ్‌కి మిక్స్డ్ టాక్ వచ్చినా.. విజయ్ దేవరకొండ క్రేజ్‌తో నిర్మాతలు గట్టెక్కెస్తారు, ఫస్ట్ వీక్‌లోనే పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుందని అందరూ భావించారు. కానీ డామిట్ కథ అడ్డం తిరిగింది. మొదటి వీకెండ్‌లో ఫర్వాలేదనిపించినా.. డియర్ కామ్రేడ్ వసూళ్లు ఇప్పుడు వీక్ డేస్‌లో వీకైపోయాయని.. సోమ, మంగళ, బుధవారాల్లో డియర్ కామ్రేడ్ వసూళ్లు చూస్తే తెలుస్తుంది. ఇక డియర్ కామ్రేడ్ కన్నా వారం ముందు విడుదలైన ఇస్మార్ట్ శంకర్ జోరు మాత్రం తగ్గలేదు.

Advertisement
CJ Advs

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఎలాంటి అంచనాలు లేని ఇస్మార్ట్ శంకర్ మొదటి రోజు యావరేజ్ తో సరిపెట్టుకున్నప్పటికీ.. కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్‌కి చేరిన ఇస్మార్ట్ శంకర్ కలెక్షన్స్.. దర్శకుడు పూరి, ఛార్మి, హీరోయిన్ నిధి చేసే భారీ ప్రమోషన్స్‌తో సెకండ్ వీక్ లోను డియర్ కామ్రేడ్‌ని తట్టుకుని మంచి కలెక్షన్స్‌ని సాధిస్తుంది. డియర్ కామ్రేడ్ విడుదలకు ముందు విజయ్ దేవరకొండ, రష్మిక చేసిన ప్రమోషన్స్‌తో పోలిస్తే ఇస్మార్ట్ విడుదలకు ముందు ప్రమోషన్స్ వీక్‌గా ఉన్నాయి. 

కానీ ఇస్మార్ట్ శంకర్ విడుదలయ్యాక పూరి అండ్ కో చేసే ప్రమోషన్స్‌తో ఇస్మార్ట్ మీద ఇంకా ఆసక్తి జనాల్లో పెరిగింది. ఇక పూరి అండ్ టీం ఇప్పటికీ ఇస్మార్ట్ ప్రమోషన్స్‌ని ఊరూరా భారీగా నిర్వహిస్తున్నారు. ఇక డియర్ కామ్రేడ్ టాక్ వీకవడంతో ఇస్మార్ట్‌కి ఇంకా కలిసొచ్చింది. మొదట్లో విజయ్ క్రేజ్‌తో డియర్ కామ్రేడ్ ఇస్మార్ట్‌ని తొక్కేస్తాడనుకుంటే... ఇప్పుడు డియర్ కామ్రేడ్‌ని ఇస్మార్ట్ శంకర్ తొక్కేశాడు.

Collections Dropped to Dear Comrade:

Ismart Shankar gets Decent Collection in week days
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs