Advertisement
Google Ads BL

‘సాహో’ సినిమానే కాదు వీడియోగేమ్ వచ్చేస్తోంది!


‘బాహుబలి’ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ మరో భారీ సినిమా ‘సాహో’తో అభిమానుల ముందకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహించగా.. యు.వి క్రియేషన్స్ సంస్థ దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో దీన్ని తెరకెక్కించింది. ఆగస్ట్ 15న థియేటర్లలోకి తీసుకురావడానికి యూనిట్ సన్నాహాలు చేస్తోంది. సరిగ్గా రిలీజ్‌కు కొన్ని రోజుల ముందు ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను చిత్రబృందం పంచుకుంటోంది. 

Advertisement
CJ Advs

సినిమా ప్రమోషన్స్‌కు ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే చేజార్చుకోకుండా చిత్రబృందం అన్ని ప్రయత్నాలు చేస్తోందన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలోనే సాహో చిత్రబృందం కూడా నడుస్తోంది. ఇప్పటికే బాహుబలి సినిమా వచ్చిన తర్వాత అదే పేరుతో గేమ్ రూపొందించడం జరిగింది. సినిమాతో ఈ గేమ్ కూడా సూపర్ డూపర్ హిట్టయ్యింది. ఇదే రీతిలో ‘సాహో’ సినిమా త్వరలో రానుండటంతో ‘సాహో’ గేమ్‌ను చిత్రబృందం ప్లాన్ చేసింది.

అతి త్వరలోనే ‘సాహో’ వీడియో గేమ్‌ని మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు మేకర్స్ ట్విట్టర్ వేదికగా అఫీషియల్‌గా ప్రకటించారు. ‘యాక్టివేటింగ్ జెట్ ప్యాక్.. గెట్ రెడీ టు ఫీల్ ది యాక్షన్ ఎట్ యువర్ ఫింగర్ టిప్స్ విత్ సాహో ది గేమ్’ అంటూ ప్రభాస్ కళ్లద్దలతో ఉన్న కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కాగా.. ఆగస్టు 30న ‘సాహో’ వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానున్నది.

Saaho: The Game to be out soon; Prabas announces launch details with interesting post:

Saaho: The Game to be out soon; Prabas announces launch details with interesting post  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs