తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్- 3 రసవత్తరంగా సాగుతోంది. మొదటి వారంను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో సీనియర్ నటి హేమను ఎలిమినేట్ చేయడం జరిగింది. అయితే రెండో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు..? ఎవరు లీస్ట్‌లో ఉన్నారు..? అనేది ఇప్పుడు బిగ్‌బాస్ ప్రియులు, ‘మా’ టీవీ వీక్షకులు, నెటిజన్ల మధ్య పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ప్రస్తుతానికి హౌస్‌లో శ్రీముఖి, హిమజ, జాఫర్, మహేష్ విట్టా, వరుణ్ సందేశ్, వితికా షెరు, పునర్నవి భూపాలం, రాహుల్ సిప్లిగంజ్ వీరిలో ఎవరో ఒకర్ని ఈ వారంలో బయటికి పంపాలని బిగ్‌బాస్ ప్లాన్ చేస్తున్నాడు. ఇందుకు ఇప్పటికే కొన్ని ప్రముఖ వెబ్‌సైట్లు, హాట్ స్టార్‌లో ఓటింగ్ ఇవ్వగా ఎక్కువ మంది వితికా షెరు, జాఫర్ పేర్లే చెబుతున్నారు.
మరీ ముఖ్యంగా హౌస్‌లో వివాదాలకు కేరాఫ్‌గా ఉన్న వితికనే బయటికి పంపించేయాలని 50% మంది నెటిజన్లు, బిగ్‌బాస్ ప్రియులు కోరుకుంటున్నారు. ఆ తర్వాత స్థానంలోనే జాఫర్ ఉండగా.. మిగిలిన వారంతా తర్వాత స్థానాల్లో ఉన్నారు. మరి ఫైనల్‌గా బిగ్‌బాస్ ఎవర్ని బయటికి పంపిస్తారన్నది తెలియాలంటే ఆదివారం వరకు వేచి చూడాల్సిందే మరి.