Advertisement
Google Ads BL

‘ఉప్పెన’ నుంచి తప్పుకోలేదట..!


తమిళనాట విభిన్నమైన పాత్రలతో హీరోగా తన కంటూ ఓ ఇమేజ్ ఏర్పరచుకుని.. చేతినిండా సినిమాల్తో బిజీగా వున్న నటుడు విజయ్ సేతుపతి. కేవలం హీరో అనే ట్యాగ్ మాత్రమే తగిలించుకోకుండా.. ఎలాంటి ఛాలెంజింగ్ పాత్ర అయినా చెయ్యగలిగిన నటుడు విజయ్ సేతుపతి. ఓ 96 సినిమానే తీసుకోండి, ఇంకా ఈమధ్యనే వచ్చిన సూపర్ డీలక్స్ సినిమా కానివ్వండి విజయ్ సేతుపతి లోని నటుడిని అందరూ ఇష్టపడే సినిమాలు అవి. ఇక  కోలీవుడ్ లోనే కాదు.. తెలుగులో చిరు సై రా నరసింహారెడ్డి సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్న విజయ్ సేతుపతి.. మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ తేజ్ కోసం విలన్ అవతారమెత్తాడు.

Advertisement
CJ Advs

సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్ హీరోగా సుకుమార్ తమ్ముడు తెరకెక్కిస్తున్న ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి హీరోయిన్ ఫాదర్ కేరెక్టర్ లో విలన్ రోల్ లో నటించడానికి ఒప్పుకుని అందరికి షాకిచ్చాడు. ఉప్పెన సినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలైంది. అయితే తాజాగా ఉప్పెన సినిమా నుండి విజయ్ సేతుపతి బయటకొచ్చాడనే టాక్ టాలీవుడ్‌ని షేక్ చేస్తుంది. 

విజయ్ సేతుపతి.. వైష్ణవ తేజ్ సినిమాలో విలన్ అనగానే ఉప్పెన సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి విజయ్ ఎందుకు ఈ సినిమా నుండి తప్పుకుంటున్నాడో అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. అయితే విజయ్ సేతుపతి ఉప్పెన సినిమా నుండి తప్పుకోలేదని అది కేవలం రూమరేనని... విజయ్ సేతుపతి ఉప్పెన సినిమా షూటింగ్ లో ఆగష్టు 16 నుండి పాల్గొనున్నాడని తాజా సమాచారం.

Vijay Sethupathi Talk of the Tollywood:

Vijay Sethupathi out from Uppena.. Not True
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs