Advertisement
Google Ads BL

‘సర్వం సిద్ధం’కు సంబంధించి సర్వం వదిలారు


ప్రముఖ దర్శకులు విఎన్.ఆదిత్య, అమ్మ రాజశేఖర్ చేతుల మీదుగా ‘సర్వం సిద్ధం’ టీజర్ విడుదల 

Advertisement
CJ Advs

సినెటేరియా మీడియా వర్క్స్ బ్యానరుపై శ్రీమతి శ్రీలత బి వెంకట్ నిర్మిస్తున్న ‘‘సర్వం సిద్దం - నవ్వుకున్నోళ్ళకు నవ్వుకున్నంత’’ శరవేగంగా చిత్ర నిర్మాణం జరుపుకుంటోంది. అతిమల్ల రాబిన్ నాయుడు దర్శకత్వంలో 100% వినోదాత్మక చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం లోగో, ఫస్ట్ లుక్, టీజర్ మరియు పోస్టర్ లను చిత్ర బృందం జూబ్లీ హిల్స్‌లోని తల్వార్ హ్యుందాయ్ షోరూంలో ఘనంగా ఆవిష్కరించింది. 

ఈ కార్యక్రమంలో సినీ దర్శకులు వి.ఎన్ ఆదిత్య, అమ్మ రాజశేఖర్, సినెటేరియా గ్రూప్ సీఈవో వెంకట్ బులెమోని, ఎన్.సి.సి మార్కెటింగ్ హెడ్ శ్రీవికాస్, సింబయోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ సంచాలకులు డా. రవి కుమార్ జైన్, టెక్స్ టైల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అమ్మనబోలు ప్రకాశ్, ప్రముఖ సీఏ నితిన్ కె పరేఖ్, సినీ నటులు ‘అక్కడొకడున్నాడు’ శివ శంకర్, ‘సమరం’ చిత్ర హీరో సాగర్ జి, సర్వం సిద్దం చిత్ర కథానాయికలు లావణ్య, పూజ, ఫరీనా, నటులు సర్వం శ్రీనివాస్, మందార్, అభిషేక్, సిద్దేశ్వర్, త్రిషాంక్, వెంకటేష్, కిరణ్, దర్శకులు అతిమల్ల రాబిన్ నాయుడు, కెమెరామెన్ సంతోష్ రెడ్డి, నిర్మాత శ్రీమతి శ్రీలత బి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీనియర్ దర్శకులు వి.ఎన్.ఆదిత్య, అమ్మ రాజశేఖర్‌లు ‘సర్వం సిద్దం’  టీజర్‌ను ఆవిష్కరించగా, ఎన్.సి.సి హెడ్ శ్రీవికాస్ చిత్ర లోగోను, టెక్స్ టైల్స్ అధ్యక్షులు అమ్మనబోలు ప్రకాష్ ఫస్ట్ లుక్, సినెటేరియా గ్రూప్ సీఈవో చిత్ర పోస్టర్ లను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా దర్శకులు వి ఎస్ ఆదిత్య మాట్లాడుతూ... ‘‘చిత్ర టీజర్‌ను చూసిన తరువాత, చలనచిత్ర రంగంలోని అలనాటి రోజులు గుర్తుకు వచ్చాయన్నారు. టీజర్‌లో చూపించినట్లుగా ఒక్కరోజైనా ఖచ్చితంగా ఉండే సినీ దర్శకునిగా సెట్లో మెలగాలనే ఆకాంక్ష ఉందన్నారు.’’ 

దర్శకులు అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ... ‘‘సర్వం సిద్దం టీజర్ తమను బాగా నవ్వించిందనీ, సినిమా కూడా 100 శాతం కామెడీ చిత్రంగా నిర్మించారని తెలిసి సంతోషపడుతున్నానన్నారు. పూర్తి స్థాయి కామెడీ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ ఆదరిస్తారని ఆయన పేర్కొన్నారు’’.

సినెటేరియా మీడియా వర్క్స్ సీఈవో వెంకట్ బులెమోని మాట్లాడుతూ... ‘‘గత ఏప్రిల్ నెలలో ప్రారంభించిన సర్వం సిద్దం సినిమా షూటింగ్ 70 శాతం పూర్తయ్యిందనీ, మిగిలిన ప్యాచ్ వర్క్‌ను ఆగస్టు 14 నుంచి చిత్రీకరించనున్నామని తెలిపారు. రానున్న దసరా - దీపావళి పండుగ సీజన్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు’’.

సర్వం సిద్దం చిత్ర దర్శకులు అతిమల రాబిన్ నాయుడు మాట్లాడుతూ... ‘‘సినిమా మొత్తం 100 శాతం కామెడీ మార్కుతో రూపొందిస్తున్నామన్నారు. సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడూ నవ్వలేక పొట్టచెక్కలవ్వడం ఖాయమన్నట్లుగా చిత్రం ఉంటుందని తెలిపారు’’. 

ఎన్.సి.సి మార్కెటింగ్ హెడ్ శ్రీవికాస్ మాట్లాడుతూ... ‘‘సర్వం సిద్దం టైటిల్ చాలా బాగా ఉందనీ, టైటిల్ లోనే విజయం కనిపిస్తోందనీ, ఈ చిత్రం విజయం ఖాయమని అన్నారు’’.

సింబయోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ సంచాలకులు డా. రవి కుమార్ జైన్ మాట్లాడుతూ... ‘‘సర్వాంగ సుందరంగా హాస్యరస ప్రధానంగా రూపొందించిన టీజర్ చాలా బావుందనీ, టీజర్ చిత్రంపై అంచనాలను బాగా పెంచిందన్నారు. చిత్రం కూడా పూర్తి కామెడీగా రూపొందించి ప్రేక్షకులను ఆహ్లాదకరమైన హాస్యాన్ని అందించాల్సిందిగా సూచించారు’’.

టెక్స్ టైల్స్ ప్రెసిడెంట్ అమ్మనబోలు ప్రకాష్ మాట్లాడుతూ...  ‘‘సర్వం సిద్దం చిన్న చిత్రమైనా, భారీ నిర్మాణ విలువలతో నిర్మించడం చాలా బావుందని పేర్కొన్నారు. చిత్రంలో ఉపయోగించిన లొకేషన్లలో భారీతనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందన్నారు’’.

ఇతర వివరాలు:

చిత్రం: సర్వం సిద్దం - నవ్వుకున్నోళ్ళకు నవ్వుకున్నంత

బ్యానర్: సినెటేరియా మీడియా వర్క్స్ 

నిర్మాత: శ్రీమతి శ్రీలత బి వెంకట్

కెమెరా: బొబ్బిలి సంతోష్ రెడ్డి

సంగీతం: డేవిడ్ జి

ఎడిటింగ్: కిరన్ రెడ్డి ఎం

నటీనటులు:

సర్వం శ్రీనివాస్, రవలి, సరిత, మధుశ్రీ, లావణ్య రెడ్డి, పూజ, ఫరీనా, త్రిషాంక్, మందార్, అభిషేక్, సిద్దేశ్వర్, వెంకటేష్, కిరణ్ ఎం, అర్జున్ కె, చరన్, వెంకటేష్, రాం, యశ్వంత్ తదితరులు.

Sarvam Siddham Teaser, First Look Released:

Sarvam Siddham Teaser Launch Event Highlights
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs