Advertisement

కామ్రేడ్‌‌పై వర్మ పంచ్‌లు..!


లేటెస్ట్‌గా రిలీజ్ అయిన చిత్రాల్లో ఇస్మార్ట్ శంకర్ అండ్ డియర్ కామ్రేడ్ లు కలెక్షన్స్ పరంగా స్లో గా నెట్టుకొస్తున్నాయి. డియర్ కామ్రేడ్ చిత్రం తొలి రోజే డివైడ్ టాక్ తో డీసెంట్‌గా పెర్ఫామ్ చేస్తుండగా... ఇస్మార్ట్ మాత్రం చాలా చోట్ల కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈచిత్రం హిట్ అవుతుందని పూరీనే అనుకోలేదు. ఇది స్వయంగా పూరీనే చెప్పాడు. రామ్ కెరీర్ లో ఇది పెద్ద హిట్.

Advertisement

ఈ హిట్ తో పూరి ఏమో కానీ పూరి గురువు రామ్ గోపాల్ వర్మ మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ఏదో తన సొంత సినిమా హిట్ అయినట్టు ఆనందపడుతున్నాడు. రీసెంట్ గా ఆయన చేసిన ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. డియర్ కామ్రేడ్ అండ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలని పోలుస్తూ ఆయన ఈ ట్వీట్ చేసారు.

‘ఇస్మార్ట్ శంకర్ నాన్‌ఇస్మార్ట్ కామ్రేడ్ కంటే ఇస్మార్ట్‌గా ఉందా.. లేక.. నాన్‌ఇస్మార్ట్ కామ్రేడ్ ఇస్మార్ట్ శంకర్‌ను మించిపోయిందా?.. నిజం రామ్ విజయానికి తెలుసు..’  అని ట్వీట్ చేసారు. అంటే ఇండైరెక్ట్ గా విజయ్ పై సెటైర్ వేశాడు. అంతే కాదు రెండు సినిమాల కలెక్షన్స్ కూడా పోస్ట్ చేసాడు. ఈయన చేసేది ఎలా ఉందంటే ‘కాకి పిల్ల కాకికి ముద్దు’ అన్నట్టు ఉంది అంటూ విజయ్ ఫ్యాన్స్ వర్మని ఏసుకుంటున్నారు.

RGV Targets Dear Comrade:

Ram Gopal Varma Happy with Ismart Shankar Success
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement