Advertisement
Google Ads BL

కింగ్‌ నాగ్‌ను టార్గెట్ చేసిన శ్రీరెడ్డి..!


టాలీవుడ్‌లో వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా పేరుగాంచిన శ్రీరెడ్డి.. తాజాగా హీరో అక్కినేని నాగార్జునను టార్గెట్ చేసింది. కింగ్‌ బిగ్‌బాస్-3కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. మొదటి, రెండు సీజన్ల కంటే భేష్ అనిపిస్తూ విజయవంతంగా షోను నడిపిస్తున్నారు. అయితే మొదటి వారంలో సీనియర్ నటి కమ్ కమెడియన్ హేమ ఎలిమినేట్ అయ్యారు. ఈమె స్థానంలో ఎవరూ ఊహించని విధంగా ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రిని వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ తీసుకోవడం జరిగింది.

Advertisement
CJ Advs

ఈ విషయంపై తన ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చిన శ్రీరెడ్డి.. నాగ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘తమన్నాకి బిగ్ బాయ్యా! (భయ్యా కాదు) దొరికాడు. నాగార్జున బాయ్యా సెలెక్షన్ సారీ.. రివేంజ్ బావుంది. సోనా ఈజ్ బెస్ట్’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ పోస్ట్‌ వెనుకున్న అర్థం పరమార్థమేంటో శ్రీరెడ్డికే ఎరుక. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, అక్కినేని అభిమానులు మాత్రం ఓ రేంజ్‌లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

కాగా.. కాస్టింగ్ కౌచ్‌పై శ్రీరెడ్డి ఉద్యమం చేస్తున్న టైమ్‌లో శ్రీరెడ్డికి తమన్నాకు అన్ని విధాలా అండగా ఉంటూ వచ్చింది. ఎప్పుడైతే జనసేన అధినేత పవన్‌ను తిట్టిందో.. అప్పట్నుంచి తమన్నా-శ్రీరెడ్డి మధ్య విబేధాలొచ్చాయ్. దీంతో అప్పట్నుంచి వీరిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేంత పరిస్థితులు నెలకొన్నాయి. ఈసారి బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశం వరిస్తుందని ఎంతో ఆశగా శ్రీరెడ్డి వేచి చూసింది. ఆ అవకాశం రాకపోగా.. తన శత్రువైన తమన్నాకు రావడంతో ఇలా వ్యంగ్యంగా శ్రీరెడ్డి పోస్ట్ చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

Srireddy Targets King Nagarjuna.. Why means..!:

Srireddy Targets King Nagarjuna.. Why means..!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs