తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్-3 నుంచి మొదటి వారంలో సినీ నటి హేమను ఎలిమినేట్ చేసిన సంగతి తెలిసిందే. హేమ స్థానంలో వైల్డ్ కార్డ్ ద్వారా ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రిని తీసుకోవడం జరిగింది. అయితే హౌస్ నుంచి బయటికొచ్చిన హేమ ఈ షోపై సంచలన ఆరోపణలు చేశారు. ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు బిగ్‌బాస్ హౌస్‌లో ఏం జరుగుతోందన్న విషయాలను బయటపెట్టారు.
హౌస్ నుంచి తనను కావాలనే ఎలిమినేట్ చేశారని.. లోపల ఒకటి జరిగితే, బయట మరొకటి చూపిస్తున్నారని నిర్వాహకులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హౌస్‌లో ఓ మదర్ ఫీలింగ్‌తో ఉన్నానని.. వంటగదిలో ఎక్కువ పెట్టుకోవద్దు.. అది తీయోద్దు ఇది తీయోద్దు అని అనడంతో అది డామినేట్ చేయడం, కమాండింగ్‌లా మిగిలిన కంటెస్టెంట్లకు అనిపించిందని దీంతో తనపై బ్యాడ్ ముద్రవేశారన్నారు.
కేవలం వంటగది వల్లే హౌస్‌లో గొడవలు వచ్చాయని.. అందుకే హౌస్‌లో ఉండటం అనవసరం అనిపించిందిని హేమ చెప్పుకొచ్చారు. అక్కా, అక్కా అని పిలుస్తూనే తనపై లేనిపోని మాటలు చెప్పారని వాపోయారు. కాగా షో ప్రసారంతో పాటు పలు సందేహాలను ‘మా’ యాజమాన్యాన్ని అడిగానన్నారు. హౌస్‌లో అందరూ తనను అక్కా.. అక్కా అంటూనే.. లేనిపోని మాటలు చెప్పి పక్కా ప్లాన్డ్‌గా బయటకు పంపేలా చేశారని హేమ చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యవహారంపై షో నిర్వాహకులు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.