Advertisement
Google Ads BL

‘డియర్ కామ్రేడ్’తో హ్యాపీగా ఉన్నారట!


విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా న‌టించిన చిత్రం ‘డియ‌ర్ కామ్రేడ్‌’. ‘ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌’ అనేది ట్యాగ్ లైన్‌. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌కుడు.  మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై తెరకెక్కిన  ఈ సినిమా ఈనెల 26న తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌ల చేశారు. విడుదలైన అన్ని  కేంద్రాలలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సందర్బంగా నిర్మాతలు సోమవారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసారు. 

Advertisement
CJ Advs

ఈ సందర్బంగా నిర్మాత నవీన్  యెర్నేని మాట్లాడుతూ .. విడుదలైన ఈ మూడు రోజుల్లో మంచి వసూళ్లు వచ్చాయి. మూడు రోజులకుగాను 21 కోట్లు దక్కింది. గ్రాస్ లో చూసుకుంటే 30 కోట్లవరకు రాబట్టింది. హీరో విజయ్ కున్న క్రేజ్ నేపథ్యంలో భారీ వసూళ్లు రావడం నిర్మాతలుగా మాకు ఆనందంగా ఉంది. అటు ఓవర్ సీస్ లో కూడా భారీ క‌లెక్ష‌న్స్ అందుకున్నాయి. అలాగే ఇతర భాషల్లో కూడా మంచి వసూళ్లు రావడం.. ఈ రోజు వీకెండ్ తరువాత కూడా అదే క‌లెక్ష‌న్స్ రావడం,  బయ్యర్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. అలాగే ఈ సినిమా నిడివి విషయంలో స్లోగా ఉందంటూ కామెంట్స్ రావడంతో 13 నిమిషాల సినిమాను కట్ చేసాం. అలాగే ఇప్పటికే ఇందులో క్యాంటీన్ సాంగ్ బాగా పాపులర్ అయింది. నిడివి దృష్ట్యా దాన్ని పెట్టలేదు, చాలా మంది కావాలని కోరుకోవడంతో నేటి నుండి ఆ సాంగ్ ని జోడించాం. ఆ పాట సినిమాకు ఇంకాస్త ఊపు ఇస్తుందని భావిస్తున్నాం అన్నారు.   

మరో నిర్మాత య‌ష్ రంగినేని మాట్లాడుతూ - రెస్పాన్స్ చాలా హ్యూజ్‌గా ఉంది. యు.ఎస్‌., యు.కెల్లో మంచి క‌లెక్ష‌న్స్ ఉన్నాయ‌ని ప్రూవ్ అయింది. ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కథను పెళ్లి చూపులు తరువాత విజయ్ విని నాకు వినిపించాడు అప్పటికి అర్జున్ రెడ్డి రాలేదు. ఆ తరువాత సినిమా  మొదలు పెట్టాం. అర్జున్ రెడ్డి పెద్ద హిట్ అవ్వడంతో ఈ స్క్రిప్ట్ విషయంలో ఏ మార్పులు చేయలేదు కానీ.. అనుకున్నాం. అప్పుడే మైత్రి నిర్మాతలు అప్రోచ్ అయ్యారు. వారివల్ల సినిమా రేంజ్ పెరిగింది. దానికి తగ్గట్టుగా మంచి వసూళ్లు అందుకోవడం ఆనందంగా ఉంది అన్నారు. 

నిర్మాత యలమంచిలి రవి మాట్లాడుతూ.. క‌లెక్ష‌న్స్ బాగున్నాయి. వరల్డ్ వైడ్ గా రిపోర్ట్ బాగుంది. ముఖ్యంగా తెలుగు సినిమాను మలయాళంలో బాగా ఆదరిస్తున్నారు. ఇప్పటికే అక్కడ వసూళ్లు వచ్చాయి. అలాగే తమిళ్, కన్నడ కూడా బాగా ఆడుతుంది. ఈ సినిమా తరువాత విజయ్ హీరోగా చేస్తున్న హీరో సినిమా మరో షెడ్యూల్ మొదలు పెట్టనున్నాం అన్నారు.

Dear Comrade Producers Press Meet Details:

Producers Happy with Dear Comrade Result
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs