Advertisement
Google Ads BL

‘బాయ్’ ట్రైలర్ వదిలారు


విశ్వరాజ్ క్రియేషన్స్ బ్యానర్ పై  అమర్ విశ్వరాజ్ దర్శకత్వం వహించి నిర్మిస్తున్న చిత్రం ‘బాయ్’. ఆర్. రవి శంకర్ రాజు మరో నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో లక్ష్య, సాహితీ లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు. ఆగస్టు 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దంగా ఉన్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను మాస్టర్ విరాట్,  ట్రైలర్ ను నిర్మాత బెక్కం వేణుగోపాల్ చేతుల మీదుగా విడుదల చేయించారు. 

Advertisement
CJ Advs

ఈ సందర్భంలోనే అతిథి బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ప్యూర్ లవ్ స్టోరీస్‌ను నేను చాలా ఇష్టపడతాను. అందుకే మా బ్యానర్‌లో మేం వయసుకు వచ్చాం సినిమా చేసాను. ఇప్పుడు ఈ చిత్ర ట్రైలర్ చూడగానే నాకు గూస్బమ్స్ వచ్చాయి.  వండర్ఫుల్ కంటెంట్ కనపడుతోంది. టెన్త్ క్లాస్‌లో ఉన్న ఏజ్ గ్రూప్ పిల్లలు ఏ రకమైన ఫీలింగ్స్‌తో ఉంటారో ఈ సినిమాలో చూపించినట్టు కనపడుతోంది. లీడ్ రోల్ లో నటించిన పిల్లలు లక్ష్య, సాహితీ కూడా  మెచ్యూర్డ్ లెవెల్ యాక్టింగ్ చేశారు. ముఖ్యంగా ఈ చిత్ర కాన్సెప్ట్ నచ్చి పివిఆర్ సినిమా వారు రైట్స్ తీసుకొని ఆగస్టు 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. అందుకు నిజంగా ఆనందించాల్సిన విషయం. బాయ్ టోటల్ టీమ్‌కు మంచి సక్సెస్ రావాలని ఆశిస్తున్నాను అన్నారు. 

మరో అతిథి డార్లింగ్ స్వామి మాట్లాడుతూ.. అమర్ నాకు 10 సంవత్సరాలుగా పరిచయం.. కానీ ఈ సినిమాతో దర్శకుడు అయ్యాడని మాత్రం ఇప్పుడే తెలిసింది. ఆరు నెలలు పిల్లలతో కష్టపడి యాక్ట్ చేయించి ఈ సినిమాను తెరకెక్కించాడు. టెన్త్ క్లాస్‌లో ఉండే వారి ప్రేమ స్వచ్ఛంగానూ.. డేరింగ్‌గానూ ఉంటుంది. ఆ ఏజ్ గ్రూప్ వారి కాన్సెప్ట్‌తో ఈ సినిమా రావడం జరుగుతోంది. పెద్ద సక్సెస్‌ను అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా... అన్నారు. 

ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేసిన సాహితీ మాట్లాడుతూ... ముందుగా అవకాశం ఇచ్చిన దర్శకుడుకి నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. ఇక ఈ సినిమా విషయానికి వస్తే... బాయ్ సినిమా ఒక బ్యూటిఫుల్  స్కూల్ లైఫ్ స్టోరీ. టెన్త్ క్లాస్ అబ్బాయికి మ్యాథ్స్ మాటిక్స్ చాలా టఫ్. అలాంటి అబ్బాయికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయనేదే కథ సారాంశం. ఈ మూవీ వల్ల నాకు ఓ మంచి సక్సెస్ వస్తుందని భావిస్తున్నా అన్నారు. 

ఈ చిత్ర దర్శకుడు మరియు నిర్మాత అమర్ విశ్వరాజ్ మాట్లాడుతూ.. ఈ చిత్ర కథ గురించి చెప్పాలంటే కాలేజ్ వైపు ఆశగా చూస్తున్న ఓ అబ్బాయి స్టోరీ. అందుకు టెన్త్ క్లాస్‌లో తను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనేది కథాంశం. ఇక ఈ సినిమాకు కెమెరామెన్ ఆస్కర్ చాలా ఇన్వాల్వ్ అయ్యి పని చేసాడు. నిర్మాత రవిశంకర్ కూడా చాలా సపోర్ట్ చేశారు. సినిమా చాలా బాగొచ్చింది అంటున్నారు. సెన్సార్ వారు కూడా క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ఇచ్చారు. నేను ఈ సినిమా చేయడానికి కారణమైన ఇద్దరు ఏకలవ్య గురువులు ఉన్నారు వారి గురించి సక్సెస్ మీట్‌లో చెబుతాను. ఈ ‘బాయ్’  చిత్రం ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తగా  విడుదలకానుందని అన్నారు.  

ఆర్. రవిశంకర్, మిర్చి మాధవి, కల్పలత లతో పాటు ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

లక్ష్య, సాహితీ, మాధవి, కల్పలత, నీరజ్, వినయ్ వర్మ, నేహల్, వర్ష, త్రిశూల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: అస్కర్, ఎడిటర్: ఏకలవ్యన్, మ్యూజిక్: ఎల్విన్ జేమ్స్, జయ ప్రకాష్. జె, ఆడియోగ్రఫి: జె. రాఘవ చరణ్, సౌండ్ ఎఫెక్ట్స్: జె ఆర్. యత్రి రాజ్, డైరెక్టర్: అమర్ విశ్వరాజ్, కో ప్రొడ్యూసర్స్: శశిధర్ కొండూరు,  ప్రదీప్ మునగపాటి, నిర్మాతలు: ఆర్. రవిశంకర్ రాజు, అమర్ విశ్వరాజ్.

Boy Trailer Released:

Boy Trailer Launch Event details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs