విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ డియర్ కామ్రేడ్ రిజల్ట్ గురించి బాక్సాఫీస్ వద్ద చర్చ జరుగుతుంది. గీత గోవిందం సినిమాతో 60 కోట్లు క్లబ్‌లో చేరిన విజయ్.. డియర్ కామ్రేడ్‌తో కూడా ఆ మార్క్‌ని అవలీలగా చేరుకుంటాడు అని అంతా భావించారు. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే అదే జరిగేది కానీ సినిమాకి మిక్స్‌డ్ టాక్ వచ్చింది.
40 కోట్ల మార్కెట్ ఉన్న ఇద్దరు హీరోస్ డియర్ కామ్రేడ్ సినిమా రిజల్ట్ ఏమి అవుతుందో అని టెన్షన్ పడ్డారు కానీ ఇప్పుడు రిలాక్స్ అయ్యారు అని టాక్ వినిపిస్తోంది. మరి వాళ్ళు అలా టెన్షన్ పడ్డారో లేదో తెలియదు కానీ వీటి గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. నిజానికి గతంలో విజయ్ స్టార్ డమ్ గురించి జరిగిన చర్చల్లో నితిన్ - నిఖిల్ లాంటి హీరోల పేర్లు బయటికి వచ్చాయి. అప్పుడు వాళ్ళు అలాంటిది ఏమి లేదు అని క్లారిటీ ఇచ్చారు. కానీ మరోసారి ఇద్దరు హీరోస్ పేరులు రావడం కొసమెరుపు. ఇటువంటివన్నీ టాలీవుడ్‌లో మాములే కానీ ఈసినిమా రిజల్ట్ ఏంటో ఈ వీకెండ్‌లో తేలిపోనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఏదో అలా అలా నడుస్తున్న ఈ సినిమా ఓవర్సీస్‌లో కూడా అదేవిధంగా నడుస్తుంది.