Advertisement
Google Ads BL

‘ఇస్మార్ట్ శంకర్’ కలెక్షన్స్‌కి బ్రేకేశాడు


గత శుక్రవారం పూరి జగన్నాధ్ - రామ్ కాంబోలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ స్మార్ట్‌గా బరిలోకి దిగింది. 19 కోట్ల థియేట్రికల్ రైట్స్ తో బిజినెస్ జరుపుకున్న ఇస్మార్ట్ శంకర్ కి విడుదలకు ముందు ఆ 19 కోట్లు రికవరీ అవడం కష్టమనే అన్నారు. ఎందుకంటే పూరి డిజాస్టర్స్ లో ఉంటే... రామ్ మార్కెట్ కూడా ఊగిసలాటలో ఉంది కనుక. ఇక సినిమా విడులయ్యాక కూడా సినిమాకి యావరేజ్ టాక్ రావడం ఒక ఎత్తు అయితే.... రివ్యూ రైటర్స్ కూడా సినిమాకి యావరేజ్ రివ్యూస్ ఇవ్వడం మరో ఎత్తు. ఇక ఇస్మార్ట్ శంకర్ కూడా రామ్ కెరీర్ కి యావరేజే అని అన్నారు అంతా. కానీ మొదటి రోజు ఓపెనింగ్స్ భారీగా పడితే.. ఏదోలే రామ్ క్రేజ్. ఇస్మార్ట్ పవర్ పని చేసింది అన్నారు. కానీ రెండో రోజు, మూడో రోజు, ఫస్ట్ వీకెండ్ అంతా ఇస్మార్ట్ జోరు కనబడింది. ఇక మొదటి వారం పూర్తవగానే బ్రేక్ ఈవెన్ కి చేరుకోవడం కాదు ఏకంగా పది కోట్ల లాభాలను పూరి - ఛార్మీలకు అందించింది. ఇస్మార్ట్ హిట్ తో రామ్ - పూరి ఉత్సాహంగా ఉండడమే కాదు.. పూరి, ఛార్మితో కలిసి హీరోయిన్ నిధితో కూడా ఇస్మార్ట్ గా టూర్స్ ప్లాన్ చేస్తూ భారీ ప్రమోషన్స్ చేస్తున్నాడు. 

Advertisement
CJ Advs

అయితే మొదటి వారం స్మార్ట్ కలెక్షన్స్ తో అదరగొట్టిన.. ఇస్మార్ట్ శంకర్ కి శుక్రవారం నుండి కలెక్షన్స్ పడిపోయాయి. ఎందుకంటే విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ భారీగా అంచనాల నడుమ థియేటర్స్ లోకి వచ్చేసింది. డియర్ కామ్రేడ్ పక్కా హిట్ అంటూ విజయ్ దేవరకొండ చేసిన ప్రమోషన్స్ తో డియర్ కామ్రేడ్ ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఇక ఇస్మార్ట్ పని అవుట్. విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ కి ప్రేక్షకుల నుండి క్రిటిక్స్ నుండి యావరేజ్ టాక్ పడింది. అయినా విజయ్ క్రేజ్‌తో డియర్ కామ్రేడ్ దడదడలాడించడం ఖాయం. మరి డియర్ కామ్రేడ్ వచ్చి ఇస్మార్ట్ శంకర్ కలెక్షన్స్‌కి స్మార్ట్‌గా బ్రేకేసేసింది.

Ismart Shankar Collections Dropped:

Dear Comrade effect On Ismart Shankar
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs