Advertisement
Google Ads BL

విజయ్ దేవరకొండ మూవీలో శ్రీదేవి కుమార్తె!


అవును మీరు వింటున్నది నిజమే.. విజయ్ దేవరకొండ సినిమాలో శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటిస్తోంది. అంటే రౌడీ సరసన నటిస్తోందని అర్థం కాదు.. ఆయన సినిమా రీమేక్‌లో నటిస్తోందని అర్థం. కాస్త కన్ఫూజన్‌గా ఉంది కదా. అదేనండి ఇప్పటికే ‘అర్జున్ రెడ్డి’ ని బాలీవుడ్‌కు ఎత్తుకెళ్లగా.. ఈసారి ‘డియర్ కామ్రేడ్‌’ను కూడా రీమేక్ చేస్తున్నారు. ఆ రీమేక్‌లో జాన్వీ నటిస్తోంది.

Advertisement
CJ Advs

‘డియర్ కామ్రేడ్’ జులై 26న థియేటర్లలోకి వచ్చి మంచి టాక్ తెచ్చుకుంది. అయితే సినిమా కథ నచ్చిన ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ తెలుగులో రిలీజ్‌కు ముందే హిందీలో రీమేక్‌కు గాను హక్కుల్ని భారీగానే ఇచ్చి తీసేసుకున్నారు. వాస్తవానికి మొదట విజయ్‌నే హీరోగా బాలీవుడ్‌కు పరిచయం చేయాలని అనుకున్నప్పటికీ ఆయన ఒప్పుకోలేదు.

దీంతో ‘దఢక్’ లో నటించి మెప్పించిన ఇషాన్ ఖట్టర్, జాన్వీలను హీరోహీరోయిన్లుగా పెట్టి ‘డియర్ కామ్రేడ్’ పట్టాలెక్కించాలని కరణ్ జోహర్ భావిస్తున్నారట. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే మరి.

sridevi daughter jhanvi in vijay devarakonda movie:

sridevi daughter jhanvi in vijay devarakonda movie  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs