ఫ్యాన్స్‌కు ఏ రేంజ్‌లో పిచ్చి ఉంటుందో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. వారి అభిమాన హీరోల సినిమాలు వచ్చినప్పుడు.. బర్త్ డేనాు.. ఇలా ప్రత్యేక సందర్భాల్లో తమ అభిమానం చాటుకుంటుంటారు. అయితే అదే అభిమాని వారి హీరోను ఇంటికి రమ్మని.. పిలిస్తే పరిస్థితి ఏంటి. అబ్బే లైట్ తీస్కుంటారు మహా అంటే సోషల్ మీడియాలో నాలుగు ముక్కలు రాసేసి మిన్నకుండిపోతారు.
అయితే బాలీవుడ్ నటుడు సోనూసూద్ మాత్రం.. అభిమాని పిలుపు మేరకు ఏకంగా భారతదేశం దాటి శ్రీలంకకు వెళ్లొచ్చాడు. ఓ మహిళా అభిమాని కోరికను మన్నించిన ఈ విలన్.. వీరాభిమాని వివాహానికి శ్రీలంక వెళ్లి వధూవరులను ఆశీర్వదించి వచ్చారు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ ఫొటో చూసిన అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మీరు నిజంగానే రియల్ హీరో సార్ అంటూ నెటిజన్లు, సినీ ప్రియులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంకొందరు శభాష్ సోనూసూద్.. దేశం దాటి వెళ్లి మా అందరి మనసు గెలుచుకున్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.