Advertisement
Google Ads BL

‘మందు కొడితే మనిషి కాదు’ టైటిల్ ఎలా ఉంది?


ఒకే కథ రెండు సినిమాలు  ప్రేక్షకుడే దర్శకత్వం మొదటి చిత్రం టైటిల్ -మందు కొడితే మనిషి కాదు 

Advertisement
CJ Advs

టిక్కెట్టు కొనుక్కుని థియేటర్ కి వచ్చే సగటు ప్రేక్షకుడు ఆ సినిమా తీసిన దర్శకుడి కన్నా తెలివిగా ఆలోచిస్తున్నాడు. ప్రేక్షకుడి ఊహకు అందని విధంగా లేదా అతన్ని తృప్తి పరిచే విధంగా సినిమా ఉంటే అది నచ్చి మంచి సినిమా అంటున్నారు. అందుకే, ఆ సగటు ప్రేక్షకుడి ఊహాశక్తిని ఆధారం చేసుకుని ఈ రెండు చిత్రాల కథనం మాటలు కూర్పు ఉంటాయి.

రెండు సినిమాల్లో కథనాలు కూర్పు మాటలు వేరువేరుగా సాగుతూ చివర్లో రెండూ ఒకే కథలు అని తెలుస్తుంది. అప్పటి వరకు ప్రేక్షకుడు తన ఊహాశక్తితో ఒక్కో సినిమాకు ఒక్కో కథ అనుకుంటాడు. అలా రెండు కథనాలు రెండు కథలుగా సాగుతాయి. ప్రేక్షకుడి ఊహాశక్తితో చేస్తున్న మాయాజాలమే ఈ ప్రయత్నం. అందుకే ఈ రెండు చిత్రాలకు ప్రేక్షకుడినే దర్శకుడిగా ప్రకటిస్తున్నారు చిత్ర యూనిట్.

రెండు థియేటర్లలో రెండు సినిమాలుగా రిలీజ్ అయినా ఒకే టిక్కెట్టు కొనుక్కుని రెండు సినిమాలు చూడొచ్చు. తొలిసారిగా చేస్తున్న ఈ వినూత్న ప్రయత్నానికి సంబంధించి మొదటి చిత్రం టైటిల్  ‘మందు కొడితే మనిషి కాదు’ అని ఖరారు చేశారు. రెండవ టైటిల్ని అతి త్వరలో అనౌన్స్ చేస్తారు. అలాగే ఈ చిత్రానికి సంబంధించి రెండు ఫస్ట్ లుక్స్ రెండు టీజర్లు ఉంటాయి. అలాగే ఈ రెండు చిత్రాలు ఒకే రోజు వేర్వేరు థియేటర్లలో రిలీజ్ అవుతాయి.

కథ కథనం మాటలు- శామ్. జె. చైతన్య

Mandu Kodithe Manishi Kaadu how is it?:

First Title Mandu Kodithe Manishi Kaadu Announced
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs