స్టార్ హీరోలైన మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లు ఫిల్మీ బ్యాగ్రౌండ్ నుండి వచ్చిన హీరోలే. వాళ్ళు అంతా తండ్రులు సంపాదించిన పేరు ప్రఖ్యాతులతో ఉండడమే కాదు.. తండ్రుల నుండి స్పెషల్ ఫ్యాన్స్ ఉన్న హీరోలు. కానీ ఏ ఫిల్మీ బ్యాగ్రౌండ్ లేకుండా హీరోగా మెట్టు మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోలకే గట్టి పోటీ ఇచ్చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు అనే చిన్న సినిమాతో హీరోగా పరిచయమై అర్జున్ రెడ్డి, గీత గోవిందంతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి అభిమాన గణాన్ని ఏర్పరుచుకున్న హీరో విజయ్. ఇప్పుడు విజయ్ అభిమానులు స్టార్ హీరోల అభిమానులకు తీసిపోవడం లేదుగాని.... స్టార్ హీరోల అభిమానులతో పోలిస్తే విజయ్ అభిమానగణం కాస్త తక్కువే.
కానీ ఇప్పుడు డియర్ కామ్రేడ్ తో గనక మళ్ళీ విజయ్ దేవరకొండ సూపర్ హిట్ కొట్టాడా... ఇక స్టార్ హీరోలకు చుక్కలే. ఎందుకంటే స్టార్ హీరోస్ సినిమాల్లోకి వచ్చాక వాళ్లకి స్టార్ డమ్ సంపాదించడానికి ఏళ్ళకి ఏళ్ళు పట్టింది. కానీ విజయ్ చాలా తక్కువ సమయంలో స్టార్ రేంజ్ కి ఎదిగిపోయాడు. ఇక డియర్ కామ్రేడ్ కూడా హిట్ అయితే చాలు విజయ్ రేంజ్ మరింత పెరిగిపోయి స్టార్ హీరోస్ కి గట్టి పోటీ ఇవ్వడానికి. ఇప్పటికే యంగ్ హీరోల బ్యాచ్ లో విజయ్ లెవల్ వేరు. యంగ్ హీరోలతో పోలిస్తే విజయ్ 100 రేట్లు మెరుగ్గా ఉన్నాడు.
ఇక విజయ్ గారి రౌడీ అభిమానులు డియర్ కామ్రేడ్ కి యావరేజ్ టాక్ వచ్చినా ఆ సినిమాని హిట్ చేసేంత కసితో ఉన్నారు. మరి విజయ్ కి హిట్ టాక్ అయినా ఓకే.. లేదా యావరేజ్ టాక్ అయినా చాలు విజయ్ రేంజ్ పెరగడానికి. అందుకే ఈ రోజు విడుదల కాబోయే డియర్ కామ్రేడ్ హిట్ అయితే స్టార్ హీరోస్ కాస్కోండి అంటాడేమో విజయ్ దేవరకొండ.