Advertisement
Google Ads BL

బ్యాడ్ లక్ ‘ఇస్మార్ట్ శంకర్‌’‌ను వదులుకున్న మెగా హీరో!


టాలీవుడ్‌లో వరుస ప్లాప్ సినిమాలతో తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ చిత్రంలో ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, నిధి అగర్వాల్, నభా నటేష్ నటీనటులుగా వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. చాలా సినిమాల తర్వాత సినిమా హిట్టవ్వడంతో ఇటు పూరీ.. అటు రామ్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. అయితే మెగా హీరో సాయిధరమ్ తేజ్ మాత్రం తెగ బాధపడిపోతున్నాడట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వార్త ఫిల్మ్‌నగర్‌లో పెద్ద ఎత్తున గుసగుసలు వినిపిస్తున్నాయి.

Advertisement
CJ Advs

ఎందుకంటే.. చాలా కాలం తర్వాత ‘చిత్రలహరి’ సినిమాతో యావరేజ్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న సాయిధరమ్ అప్పట్లో పూరితో సినిమా చేసే ఛాన్స్ వచ్చిందని టాక్. ఆ సినిమానే ‘ఇస్మార్ట్ శంకర్’ అట. వాస్తవానికి మొదట తన కుమారుడు ఆకాశ్‌తో చేయాలని భావించిన పూరీ ఆ తర్వాత సాయిధరమ్‌నే ఫిక్స్ అయ్యారట. అయితే ఫుల్ మాస్ డోస్ ఉండటంతో కథంతా విన్నాక ‘సారీ.. సార్’ అని చెప్పేశారట. దీంతో ఎవరైతే సెట్ అవుతారా అని ఆలోచన పడ్డ పూరీ అండ్ చార్మీ.. రామ్‌ను ఫైనల్ చేసేశారట.

కథంతా విన్న రామ్ ఏ మాత్రం ఆలోచించకుండా నేను రెడీ సార్.. అని చెప్పడంతో అనుకున్న టైమ్‌కే షూటింగ్ కూడా షురూ చేసేశారట. అయితే ఇప్పుడు సినిమా సూపర్ డూపర్ హిట్టవ్వడంతో ‘అయ్యో.. చేజేతులారా సినిమా వదులుకుంటి కదా..’ అని సాయిధరమ్ తెగ బాధపడిపోతున్నాడట. అయితే తన అత్యంత సన్నిహితులే ఈ సినిమా చేయొద్దని మెగా హీరోకు ఉచిత సలహా ఇచ్చారట. ఇందుకు కారణం పక్కా మాస్‌గా ఉండటం.. డైలాగ్స్‌లో బూతులుండటంతో ఆ సలహా ఇచ్చారట. ఏదేమైనప్పటికీ ఇది కానీ సాయిధరమ్ చేతిలోకి వెళ్లుంటే సినిమా మరో రేంజ్‌లో ఉండేదని.. హిట్ కూడా అకౌంట్లో పడేది కదా.. అని మెగాభిమానులు ఫీలవుతున్నారట.

Mega Hero Feeling Bad For Missing Ismart Shankar:

Mega Hero Feeling Bad For Missing Ismart Shankar
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs