Advertisement
Google Ads BL

హైకోర్టు, ఖాకీలు పట్టించుకోకపోవడంతో నాగ్ హ్యాపీ!


తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్-3 పై ఎన్ని వివాదాలు రేగాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చివరి నిమిషం వరకు అసలు ఈ షో రన్ అవుతుందా..? కాదా..? అనేదానిపై సస్పెన్షనే. ఓ వైపు దర్శకనిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి మరోవైపు.. యాంకర్ శ్వేతారెడ్డి, నటి గాయత్రీ గుప్తా పోలీసు స్టేషన్లు, తెలంగాణ హైకోర్టులో ఫిల్ వేయడంతో వివాదం మరింత పెద్దదైంది. అయితే ఈ వ్యవహారంపై హైకోర్టునుంచి అనుకూలంగా తీర్పురావడంతో షో షురూ అయ్యింది. ఈ వివాదంపై ఫస్ట్ టైమ్ షోకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జున స్పందించారు.

Advertisement
CJ Advs

"షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించడం చాలా సంతోషంగా ఉంది. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమం చేసేటప్పుడు ఒకే చోట బిగుసుకుని కూర్చోవాల్సి వచ్చేది కానీ.. బిగ్ బాస్-3 షోలో మాత్రం అటూఇటూ తిరిగేందుకు స్వేచ్ఛ ఉంది. బిగ్ బాస్-3 ఇప్పటికి ఒక వారమే అయింది. నాకు తెలిసి బిగ్ బాస్ కార్యక్రమం 15 లేదా అంతకంటే ఎక్కువ దేశాల్లో నడుస్తోంది. వేర్వేరు భాషల్లో పలు సీజన్లలో విజయవంతంగా నడుస్తోంది. కాంట్రావర్సీలను గాలి నుంచి కూడా పుట్టించవచ్చు. తెలంగాణ పోలీసులు, హైకోర్టు ఈ విషయాన్ని పట్టించుకోవడంపై నేను సంతోషంగా ఉన్నాను. ఈ విషయంలో నిజంగా తప్పు జరిగితే దోషులను కఠినంగా శిక్షించాలి" అని నాగ్ తేల్చిచెప్పారు.

అంతటితో ఆగని ఆయన.. బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎవరెవరు అడుగుపెడతారు..? అనే విషయం తనకు చివరి 5 నిమిషాల వరకూ కూడా తెలియదన్నారు. ఈ షో వందరోజులు పూర్తి చేసుకున్న తర్వాత కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘బంగార్రాజు’ సినిమా పట్టాలెక్కుతుందని నాగ్ స్పష్టం చేశారు. కాగా నాగ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా నటించిన ‘మన్మథుడు-2’ మూవీ ఆగస్ట్-09న రిలీజ్ కానున్న విషయం విదితమే.

Nagarjuna reacts On Bigg Boss-3 Controversy:

Nagarjuna reacts On Bigg Boss-3 Controversy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs