సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ అండ్ కన్నడ బ్యూటీ రష్మిక మందన్న కలిసి నటించిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రం ఈనెల 26 అంటే రేపు రిలీజ్ కానుంది. ఇక ఓవర్సీస్ లో 25 వ తేదీ రాత్రి నుండి ఈచిత్రం యొక్క ప్రీమియర్స్ వేయనున్నారు. అయితే ఈ మూవీకి విపరీతమైన క్రేజ్ ఉండడంతో వారం ముందు నుండే అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసారు. ఓపెన్ చేసిన కొన్ని గంటల్లోనే టికెట్స్ అన్ని ఫుల్ అయిపోయాయి. దీనితో అక్కడ చాలామందికి టికెట్స్ దొరకని పరిస్థితి.
ఈనేపధ్యంలో ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూషన్ సంస్థ సరిగమ టికెట్లు దొరకని వారి కోసం సాయంత్రం 6 గంటల నుండి మొదలయ్యే ప్రీమియర్ షోల కంటే ముందే కొన్ని చోట్ల ఎర్లీ ప్రీమియర్ షోస్ వేయనుంది. అలా చేయడం వల్ల చాలామందికి ఈ సినిమాను చూసే అవకాశం వస్తుంది అని వారు భావిస్తున్నారు. దీనిబట్టి అర్ధం చేసుకోవచ్చు ఈసినిమాకి ఎంత డిమాండ్ ఉందో అని. తెలుగు స్టేట్స్ లో అయితే ఈసినిమాకు ఉన్న క్రేజ్ వేరే చెప్పనసరం లేదు.
ఇక ఈమూవీ కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వం చేసారు. ఈసినిమా తీయడం కోసం భరత్ మూడేళ్లు పాటు విజయ్ కోసం వెయిట్ చేసారు. చూద్దాం తన మొదటి సినిమాతోనే ఈ డైరెక్టర్ ఏ స్థాయికి వేళ్తాడో..