Advertisement
Google Ads BL

‘జెర్సీ’ రీమేక్ కోసం హీరో ఎంత అడిగాడో తెలుసా?


టాలీవుడ్‌లో అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ పెద్దస్టార్ అయ్యాడు. క్రేజ్ కి క్రేజు, మార్కెట్ కి మార్కెట్ అన్ని విజయ్ సొంతమయ్యాయి. ఆ సినిమాతో విజయ్ దేవరకొండ అంటే ఏంటో ప్రూవ్ చేసేసుకున్నాడు. అందుకే అతని నెక్స్ట్ ప్రాజెక్టులు మీద భారీ క్రేజ్ పెరిగి, ఆ సినిమాలు హిట్ అయ్యేలా చేశాయి. ఇక ఆ సినిమా తర్వాత విజయ్ పారితోషకం రెండింతలు పెరిగింది. ఇక తాజాగా అర్జున్ రెడ్డి రీమేక్ బాలీవుడ్‌లో సునామి సృష్టించిన విషయం తెలిసిందే. షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిన కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో బాలీవుడ్‌లో ఈ ఏడాది 200 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాతో షాహిద్ కపూర్ రేంజ్ ఖాన్స్ త్రయానికి దగ్గరైపోయింది. కబీర్ సింగ్ కి ముందు పద్మావత్‌తో మంచి హిట్ కొట్టిన షాహిద్ కి ఆ హిట్ లో మేజర్ పార్ట్ దీపికా, రణవీర్ లకే వెళ్ళిపోయింది. అయితే షాహిద్ కూడా కబీర్ సింగ్ కలెక్షన్స్ చూసాక తన పారితోషకాన్ని అమాంతం పెంచేసాడనే టాక్ వినబడుతుంది.

Advertisement
CJ Advs

అది కూడా మరో టాలీవుడ్ రీమేక్ కోసమట. తెలుగులో నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన జెర్సీ సినిమా ఇక్కడ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు జెర్సీని బాలీవుడ్ లో రీమేక్ చేసే ప్రయత్నాల్లో బాలీవుడ్ నిర్మాతలు ఉన్నారు. హిందీ రీమేక్ రైట్స్‌ను 30 కోట్లకి దక్కించుకున్న బాలీవుడ్ నిర్మాతలు... ఈ సినిమాలో నటించమని షాహిద్ కపూర్ ను సంప్రదించారట. అయితే షాహిద్ కపూర్ ఈ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ.... పారితోషకం కింద 40 కోట్లు అడుగుతున్నట్టుగా సమాచారం. కబీర్ సింగ్ తో 300 కోట్ల క్లబ్బులోకి చేరుకోబోతున్న షాహిద్ కపూర్ ఇప్పుడు ఆ రేంజ్ పారితోషకాన్ని ఆశిస్తున్నాడని అంటున్నారు. అయితే షాహిద్ చెప్పిన ఫిగర్ కి బాలీవుడ్ నిర్మాతలు ఆలోచనలో పడినట్లుగా తెలుస్తుంది.

Shahid Kapoor Remuneration Hiked :

Shahid Kapoor demands Rs 40 crore to act in Hindi remake of Nani’s Jersey?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs