Advertisement
Google Ads BL

పోస్ట్ ప్రొడక్షన్‌లో ‘హేజా’.. త్వరలోనే విడుదల


‘మిస్టర్ 7, చిత్రం చెప్పిన కథ, మామ ఓ చందమామ’ చిత్రాలకు సంగీత దర్శకుడిగా పని చేసి మంచి ప్రశంసలు పొందారు మున్నా కాశీ. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘హేజా’. (ఎ మ్యూజికల్ హారర్). విఎన్‌వి క్రియేషన్స్ పతాకంపై కెవిఎస్ఎన్ మూర్తి ఈ చిత్రాన్ని నిర్మించారు. ముమైత్ ఖాన్, నూతన నాయుడు(బిగ్ బాస్ ఫేమ్), ల‌క్ష్మ‌ణ్(ఆర్.ఎక్స్ 100ఫేమ్), లిజి గోపాల్, ప్రీతం నిగమ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. నాని చమిడిశెట్టి సినిమాటోగ్రఫీని అందించారు. మ్యూజికల్ హారర్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్ర టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్‌తో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా దర్శకుడు, హీరో మున్నా కాశీ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు చాలా సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశాను. ఫస్ట్ టైమ్‌ హీరోగా, దర్శకుడిగా మారి చేస్తున్న సినిమా ఇది. ఒక మ్యూజికల్ హారర్‌గా అద్భుతమైన కథాంశంతో తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కి ఆడియన్స్ మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకు మ్యూజిక్‌తో పాటు ఆర్.ఆర్ హైలెట్‌గా నిలవనుంది. టెక్నికల్‌గా హై రేంజ్‌లో ఉంటుంది. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన స‌హ‌నిర్మాత వి.య‌న్ వోలేటి, నిర్మాత కెవిఎస్ఎన్ మూర్తిగారికి కృతజ్ఞతలు. ఈ సినిమా అత్యాధునిక 5.1 మిక్సింగ్, డాల్బీమిక్సింగ్‌తో రూపొందుతోంది. ఈ సినిమాకి సపోర్ట్ చేసిన అందరికి ధన్యవాదాలు. ఈ సినిమాతో ముమైత్ ఖాన్‌గారు రీఎంట్రీ ఇస్తున్నారు. సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. ఈ సినిమా విజయంపై కాన్ఫిడెంట్‌గా ఉన్నాం’’ అన్నారు.

నిర్మాత కెవిఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ.. ‘‘ఇప్పటివరకు వచ్చిన అన్ని హారర్ సినిమాలకు డిఫరెంట్‌గా ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ఎంతో క్లారిటీగా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా సినిమా ఉంటుంది. అలాగే టెక్నికల్‌గా కూడా బాగా రావడానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ హాలీవుడ్ రేంజ్లో ఉందంటూ అటు ప్రేక్షకులు ఇటు ట్రేడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఈ సినిమాలో నటి ముమైత్ ఖాన్ క్యారెక్టర్ గత చిత్రాలకు సంబంధం లేకుండా సంథింగ్ స్పెషల్ అనేలా ఉంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు.

మున్నా కాశీ, ముమైత్ ఖాన్, నూతన నాయుడు, ల‌క్ష్మ‌ణ్(ఆర్.ఎక్స్ 100), లిజి గోపాల్, ప్రీతం నిగమ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ప్రొడ్యూసర్: కెవిఎస్ఎన్ మూర్తి, స‌హ‌నిర్మాత: వి.య‌న్ వోలేటి, బ్యానర్: వి.ఎన్.వి క్రియేషన్స్, మ్యూజిక్: మున్నా కాశీ అలియాస్ కె.వి.ఎస్.ఎన్ మూర్తి, సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి, ఎడిటర్: గ్యారీ బి హెచ్, పి.ఆర్.ఓ: సాయి సతీష్, స్టోరీ-స్క్రీన్ ప్లే-మ్యూజిక్-డైలాగ్స్ -డైరెక్షన్: మున్నా కాశీ.

Heza in Post Production Stage:

Heza Movie Latest Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs