ఒకట్రెండు కాదు కొన్నేళ్లుగా ఒకే ఒక్క హిట్‌కోసం కొందరు డైరెక్టర్స్ వేయికళ్లతో వేచిచూస్తున్నారు. ఇలాంటి డైరెక్టర్స్ టాలీవుడ్‌లో నలుగు ఉన్నారని చెప్పుకోవచ్చు. వారిలో ఇద్దరు గురు, శిష్యులు.. మరో లేడీ డైరెక్టర్, మరో డైరక్టర్ నలుగూరూ ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే కొన్నేళ్లుగా హిట్ లేని వీళ్లకు 2019 ఏడాది బాగా కలిసొచ్చిందనే చెప్పుకోవాలి.
పూరీ జగన్నాథ్.. ‘టెంపర్’ తర్వాత ‘ఇస్మార్ట్ శంకర్’, నందిని రెడ్డి.. ‘అలా మొదలైంది’ తర్వాత ‘ఓ బేబీ’.. రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’.. కిషోర్ తిరుమల ‘నేను శైలజ’ తర్వాత ‘చిత్రలహరి’తో హిట్ కొట్టారు. వీరంతా కొన్నేళ్లు హిట్ కోసం వేచి చూస్తున్నవారే.
కొన్నేళ్లుగా ఎదురుచూసిన ఈ నలుగురు డైరెక్టర్స్ 2019లో అడుగుపెట్టిన తర్వాత అదృష్టం కలిసొచ్చింది. ఇక ఇదే ఫామ్‌లో కొనసాగుతూ మరెన్నో సినిమాలను తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్‌లు ఆ డైరెక్టర్స్ ఖాతాలో పడాలని www.cinejosh.com ఆశిస్తోంది.