Advertisement
Google Ads BL

సెల్ఫీ‌తో పండగ చేసుకుంటున్నారు


‘ప్ర‌తిరోజూ పండ‌గే’ సెట్‌లో సాయితేజ్, రాశిఖ‌న్నా సెల్ఫీ

Advertisement
CJ Advs

‘చిత్రలహరి’ చిత్రంతో మంచి విజయం అందుకొన్న సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా.... భలే భలే మగాడివోయ్, మహానుభావుడు వంటి బంపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మారుతి దర్శకుడిగా, ఎన్నో ఇండస్ట్రీ హిట్ చిత్రాల్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, వంద కోట్ల క్లబ్‌లో చేరిన గీత గోవిందం వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన బన్నీ వాస్ నిర్మాతగా ‘ప్ర‌తిరోజూ పండ‌గే’  చిత్రం పూజాకార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని షూటింగ్‌కి వెళ్ళిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాలోని న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్‌ని ఎనౌన్స్ చేయ‌గానే చాలా పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చింది. కొన్ని ప్రాజెక్ట్స్‌కి అంతే అన్ని అలా క‌ల‌సివ‌స్తాయి. 

ఈ చిత్రంలో సాయితేజ్‌, రాశిఖ‌న్నాలు జంట‌గా న‌టిస్తున్నారు. వీరిద్ద‌రూ ఇంత‌కు ముందు సుప్రీమ్ లాంటి ఎంట‌ర్‌టైనింగ్ ఫిల్మ్ లో చేశారు. అలాగే ఈ బ్యాన‌ర్ పై మారుతి కాంబినేష‌న్‌లో భ‌లేభ‌లేమ‌గాడివోయ్ వంటి ఎంట‌ర్‌టైనింగ్ ఫిల్మ్ వ‌చ్చింది. ఇప్ప‌డు వీరంతా ఒకే సెట్‌లో వుంటే ఎంట‌ర్‌టైన్‌మెంట్ కాక ఇంకేమిటి ప్ర‌తిరోజూ పండ‌గే అనే టైటిల్ జ‌స్టిఫికేష‌న్‌లా షూటింగ్ జ‌రుగుతుంది. సుప్రీమ్ హీరో సాయితేజ్‌, రాశిఖ‌న్నా క‌లిసి వున్న సెల్ఫీ పిక్ ని హీరోయిన్ రాశిఖ‌న్నా ట్వీట్ చేయ‌టం మెగా అభిమానుల‌తో పాటు సోష‌ల్ మీడియా ఫ్యాన్స్ కూడా పండ‌గ చేసుకుంటున్నారు.

ప్ర‌స్తుతం హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. త్వ‌ర‌లో రాజ‌మండ్రి ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ కోసం సిద్ధ‌మ‌వుతున్నారు.

Sai Tej and Raashi Khanna selfie at Pratiroju Pandage Sets :

Raashi Khanna Shared Selfie with Sai Tej in Social Media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs