Advertisement
Google Ads BL

రెమ్యూనరేషన్ లేకుండానే రవితేజ..!


ప్రస్తుతం ఈ న్యూస్ ట్రెండ్ అవుతుంది. ఏంటంటే రవితేజ రెమ్యూనరేషన్ లేకుండా ఓ సినిమా ఒప్పుకున్నాడు. రెమ్యూనరేషన్ ఎంతో మాట్లాడిన తరువాత కథలు వినే రవితేజ ఒక్కసారిగా ఇలా ఎందుకు రెమ్యూనరేషన్ లేకుండా నటిస్తున్నాడు అని మీకు ఆలోచన రావొచ్చు. రవితేజ ప్రస్తుతం డిస్కో రాజా అనే సినిమా చేస్తున్నాడు. ఈచిత్రం 75 శాతం కంప్లీట్ అయింది. ఈమూవీ తరువాత రవితేజ.. ఆర్‌ఎక్స్‌ 100 దర్శకుడు అజయ్‌ భూపతి దర్శకత్వంలో రూపొందే మహాసముద్రంలో నటించనున్నాడు.

Advertisement
CJ Advs

ఇందులో ఓ కీలక పాత్రలో సిద్ధార్థ్‌ నటించనున్నాడు. ఈసినిమాకి రవితేజ రెమ్యూనరేషన్‌ లేకుండా లాభాల్లో వాటా మాత్రం తీసుకోవడానికి అంగీకరించాడు. కారణం రవితేజకి ఈ కథ బాగా నచ్చిందట. కానీ ప్రొడ్యూసర్స్ రవితేజ అడిగినంత ఇచ్చుకోలేము అని అవసరం అయితే వేరే హీరోతో వెళ్తాము అని చెప్పడంతో ఈ కథ వదులుకోవడం ఇష్టం లేని రవితేజ లాభాల్లో వాటాకి ఓకే అన్నాడట. 

కథ పరంగా ఈచిత్రంకి హిందీ డబ్బింగ్‌ రైట్స్‌తో పాటు శాటిలైట్‌ రైట్స్‌ వస్తాయి అని భావించి రవితేజ ఓకే చెప్పాడట. రెండుమూడు నెలల్లో ఈమూవీ స్టార్ట్ అయ్యే అవకాశముంది.

No Remuneration to Mass Maharaja Raviteja:

Mass Maharaja Raviteja, Ajay Bhupathi Film Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs