Advertisement
Google Ads BL

‘మ‌థ‌నం’ సినిమా చాలా బాగుంది: సురేంద‌ర్ రెడ్డి


మ‌థ‌నం సినిమా చూశా , చాలా బాగుంది - ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి

Advertisement
CJ Advs

శ్రీనివాస్ సాయి, భావ‌న‌ రావు జంట‌గా అజయ్ సాయి మ‌నికంద‌న్ ద‌ర్శ‌క‌త్వంలో కాశీ ప్రొడక్ష‌న్స్  ప‌తాకంపై దివ్యా ప్ర‌సాద్‌, అశోక్ ప్ర‌సాద్ నిర్మిస్తున్న చిత్రం మ‌థ‌నం. ఈ చిత్ర టీజ‌ర్ విడుద‌ల కార్యక్ర‌మం సోమ‌వారం హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్‌లో జ‌రిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డి దంప‌తులు టీజ‌ర్‌ని విడుద‌ల చేశారు. 

ఈ సంద‌ర్బంగా ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డి మాట్లాడుతూ, నిర్మాత అశోక్ దాదాపు 15ఏండ్లుగా తెలుసు. ఇద్దరం మంచి స్నేహితులం. నాతోపాటు క‌థా చర్చ‌ల్లో కూడా పాల్గొనేవాడు. త‌న‌కి సినిమాపై మంచి ప‌ట్టుంది. సినిమాల్లో ఏదైనా చేయాల‌ని చాలా  ప్ర‌య‌త్నాలు చేశారు. త‌ర్వాత మ‌ధ్య‌లో వ‌దిలేసి అమెరికా వెళ్ళి బాగా సంపాదించారు. ఏడేండ్ల త‌ర్వాత స‌డెన్‌గా వ‌చ్చి సినిమా చేస్తున్నా అని చెప్పారు. త‌ను మ‌ళ్ళీ సినిమాలు చేస్తాడ‌నుకోలేదు. ఆయ‌న గ‌ట్స్ ని మెచ్చుకోవాలి.  టీమ్ అంతా ఎంతో క‌ష్ట‌ప‌డి సినిమా చేశారు. య‌దార్థ సంఘ‌ట‌న ఆధారంగా రూపొందించిన చిత్ర‌మిది. సినిమాకిదే ప్ల‌స్ అవుతుంది.  పెద్ద విజ‌యం సాధించాల‌ని, అశోక్‌ పెద్ద నిర్మాత‌గా ఎద‌గాల‌ని కోరుకుంటున్నా. అలాగే నాతో కూడా సినిమా చేయాల‌ని కోరుకుంటున్నా. ద‌ర్శ‌కుడు అజ‌య్ కూడా బాగా తెలుసు. నా సినిమాల‌కి కూడా కొరియోగ్ర‌ఫీ చేశారు. సినిమా చూశా. చాలా బాగుంది. భ‌విష్య‌త్‌లో పెద్ద ద‌ర్శ‌కుడు కావాలి. హీరోహీరోయిన్లు బాగా న‌టించారు. టెక్నీషియ‌న్ల వ‌ర్క్ బాగుంది.  సినిమాని అంద‌రు ఆద‌రించాల‌ని కోరుకుంటున్నా అని చెప్పారు. 

హీరో సాయి రోన‌క్ మాట్లాడుతూ, మంచి మార్కెట్ ఉన్న హీరోకి పెట్టాల్సినంత బ‌డ్జెట్ పెట్టి సినిమా తీశారు. ఇప్పుడు నేనెవ‌రో అంద‌రికి తెలియ‌దు. ఈ చిత్రం త‌ర్వాత అంతా మ‌థ‌నం సాయి అంటారు. నా కెరీర్ మ‌థ‌నంకి ముందు, మ‌థ‌నంకి త‌ర్వాత అనేలా ఉంటుంది. అంద‌రికి నచ్చే చిత్ర‌మ‌వుతుంద‌నుకుంటున్నా అని చెప్పారు. 

చిత్ర ద‌ర్శ‌కుడు అజ‌య్ సాయి చెబుతూ, ద‌ర్శ‌కుడిగా  సురేంద‌ర్‌రెడ్డి నాకు గురువు లాంటి వారు. ఆయ‌న వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వం నేర్చుకున్నా. యువ‌త సినిమా ద్వారా న‌న్ను కొరియోగ్రాఫ‌ర్‌గా ప‌రిచ‌యం చేసిన ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్‌కి థ్యాంక్స్. ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తున్న నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు. జ‌స్ట్ ఒక ఐడియా, సీన్ విని నిర్మాత అశోక్ సినిమాని నిర్మించేందుకు రెడీ అయ్యారు. విందా, కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, జానీ ఇలా టెక్నీషియ‌న్ల‌కు థ్యాంక్స్. సాయి, భావ‌న చాలా బాగా చేశారు. ఒక జెన్యూన్  ఫిల్మ్ చేశాం. సినిమా ఇంత బాగా రావ‌డానికి స‌పోర్ట్ చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్లు, మా త‌ల్లిదండ్రులు, స్నేహితుల‌కు థ్యాంక్స్. ఈ  సినిమాకి ఏ టైటిల్ పెట్టాల‌ని మ‌థ‌న ప‌డుతున్న స‌మ‌యంలో స‌త్య ఈ టైటిల్ చెప్పారు. ఆయ‌న‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు అని అన్నారు. 

ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి స‌తీమ‌ణి దీపా మాట్లాడుతూ, సినిమా కోసం అశోక్ ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. స‌క్సెస్ ఆయ‌న చేతుల్లో ఉంది. క‌చ్చితంగా సినిమా విజ‌యం సాధిస్తుంది అని అన్నారు. 

క‌థానాయిక భావ‌న చెబుతూ, బ్యూటిఫుల్ ల‌వ్ స్టోరీ ఇది. విందాగారు అంద‌మైన విజువ‌ల్స్ అందించారు. ఇంత మంది సినిమాలో భాగ‌మైనందుకు ఆనందంగా ఉంది అని తెలిపారు. 

నిర్మాత అశోక్ చెబుతూ, జెన్యూన్ గా, నిజాయితీగా చేసిన చిత్ర‌మిది. స‌పోర్ట్ చేసిన ప్ర‌తి ఒక్కరికి ధ‌న్య‌వాదాలు అని చెప్పారు. 

లిరిక్ రైట‌ర్ పూర్ణాచారి చెబుతూ, సినిమాలో నాలుగు పాట‌లుంటాయి. నాలుగూ నేనే రాశాను. నన్ను న‌మ్మి అవ‌కాశం క‌ల్పించిన ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కు థ్యాంక్స్ అని అన్నారు. 

ఈ కార్యక్ర‌మంలో మ‌రో నిర్మాత దివ్యా ప్ర‌సాద్‌, సుభాష్, స‌త్య శ్రీ, హ‌న్సిక్‌, కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు. 

ఈ  చిత్రానికి సంగీతం: రాన్ యెతాన్ యోహాన్‌, నేప‌థ్య  సంగీతం: అస్లామ్ కెయి, ఎడిట‌ర్: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, ఆర్ట్: షేక్ జాను, కొరియోగ్రాఫ‌ర్: హ‌రి కిర‌ణ్‌, ఫైట్స్: సుబ్బు, న‌బా, పిఆర్ ఓ: వంశీ శేక‌ర్‌. 

Surendra Reddy Launches Madhanam Movie teaser:

Madhanam Is very good film says Surendra Reddy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs