Advertisement
Google Ads BL

అమెజాన్‌కు నెట్ ప్లిక్స్ షాకిచ్చింది


డిజిటల్ ప్రపంచంలో అమెజాన్ ప్రైమ్ ఎంతగా దూసుకుపోతుంది అంటే.... లేటెస్ట్ సినిమాలను భారీ ధరలు పెట్టి కొంటూ ఆయా నిర్మాతలకు ఒక వరంగా మారింది. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లు ఎప్పటికప్పుడు మూవీస్ విషయంలో పోటీపడుతుంటే.... ఆ పోటీలో అమెజాన్ ప్రైమ్ నెట్ ఫ్లిక్స్ ని తొక్కేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ తో టాలీవుడ్, కోలీవుడ్ సినిమాల విషయంలో నెట్ ఫ్లిక్స్ పోటీపడలేకపోతుంది. బిగ్ ప్రాజెక్ట్స్ ని అమెజాన్ ప్రైమ్ భారీ ధరలకు  చేజిక్కించుకుంటుంది. అయితే తాజాగా అమెజాన్ కి నెట్ ఫ్లిక్స్ పోటీ ఇస్తుంది. నిన్నటికి నిన్న సమంత నటించిన ఓ బేబీ సినిమాని ఎగరేసుకుపోయిన నెట్ ఫ్లిక్స్ తాజాగా మన్మథుడు  2 ని కూడా అమెజాన్ కి పోటీగా కొనేసినట్లుగా సమాచారం.

Advertisement
CJ Advs

మన్మథుడు సినిమాకి సీక్వెల్ గా రాహుల్ రవీంద్రన్ మన్మథుడు 2 సినిమాని నాగార్జున - రకుల్ ప్రీత్ హీరోహీరోయిన్స్ గా తెరకెక్కిస్తున్నాడు. చాలా స్పీడుగా మన్మథుడు 2 షూటింగ్ పూర్తి చేసిన రాహుల్.. ప్రస్తుతం ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టాడు. నాగార్జున ఈ వయసులోనూ మన్మథుడుగా మెరిసిపోతుంటే.. హీరోయిన్ రకుల్ ప్రీత్ మాత్రం గ్లామర్ తో పిచ్చెక్కిస్తుంది. పొట్టి పొట్టి నిక్కర్లతో హాట్ హాట్ గా కనబడుతున్న రకుల్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా కనబడుతుంది. ఇంకా సమంత, కీర్తి సురేష్, మంచు లక్ష్మిలు గెస్ట్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. రొమాంటిక్ ఎంట‌ర్‌ టైన‌ర్ గా తెరకెక్కిన ఈ సినిమా మీద అంచనాలు నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమాని 7.4 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. మరి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఆగష్టు 9 న విడుదల కాబోతుంది.

Netflix gives Shock to Amazon Prime:

Netflix Bags Manmadhudu 2 Rights
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs