టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన కొరటాల శివకు మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. ఇందుకు కారణం కొరటాల దర్శకత్వంలో తెరెక్కిన ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’ సినిమాలే. అయితే ఈ కాంబోలో సినిమా తెరకెక్కడంతో పాటు సూపర్ డూపర్ హిట్టవ్వడంతో వీరి మధ్య బాండింగ్ మరింత పెరిగింది. మహేశ్ కోసం త్వరలోనే కొరటాల నిర్మాతగా మారబోతున్నాడట. ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతోంది.
ఇక అసలు విషయానికొస్తే.. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా నటీనటులుగా పరుశురామ్ తెరకెక్కించిన ‘గీత గోవిందం’ సినిమా సూపర్ డూపర్ హిట్టయిన విషయం విదితమే. అయితే ఈ సినిమా తర్వాత మహేశ్ సినిమా తీయాలని పరుశురామ్ ఫిక్స్ అయినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అంతేకాదు.. మహేశ్ కూడా కథ విని ‘తర్వాత సినిమా మీతోనే’ అన్నారని టాక్ నడిచింది.
అయితే తాజాగా.. మహేశ్-పరుశురామ్ కాంబోలో తీయాలనుకున్న కథను ఇప్పటికే కొరటాల విని నిర్మాతగా వ్యవహరిచడానికి తాను సిద్ధమని చెప్పేశారట. ఈ కాంబో కలిస్తే ఇక సినిమా ఏ రేంజ్‌కు వెళ్తుందో ఇక ఊహించనక్కర్లేదు. అంతేకాదు.. అవసరమైతే కథలో మార్పులు చేర్పులు చేసుకుని మరీ కొరటాల హిట్ కొట్టేయడం మాత్రం పక్కా అని స్పష్టంగా అర్థమవుతోంది. ఇది ఎంత వరకు నిజమో.. అనేది తెలియాలంటే అధికార ప్రకటన వెలువడేదాకా వెయిట్ చేయాల్సిందే.