Advertisement
Google Ads BL

బిగ్‌బాస్ హోస్ట్‌గా నాగ్ హిట్టా.. ఫట్టా!?


తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షోగా పేరుగాంచిన బిగ్‌బాస్ మూడో సీజన్ ఆదివారం రాత్రి సరిగ్గా 9:00 గంటలకు ప్రారంభమైన విషయం తెలిసిందే. షో మొదలైన మొదటి రోజే నాగ్ హిట్టా..? ఫట్టా అనేది బిగ్‌బాస్ ప్రియులు తేల్చేశారు. సీజన్-1కు హోస్ట్‌గా వ్యవహరించిన జూనియర్ ఎన్టీఆర్, సెకండ్‌కు నాని, థార్డ్‌కు నాగ్‌ ఇలా ఎవరు మెప్పించారు..? అని సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చే జరుగుతోంది. 

Advertisement
CJ Advs

నాగ్ మొదటి రోజే అదరగొట్టేశాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.. ఇది పక్కా!. నాగ్ వాక్ చాతుర్యం, ఆయన స్టైయిల్‌, మధ్య మధ్యలో పంచ్ డైలాగ్స్, ఇక కోతి బొమ్మ పండు వీటన్నింటి వల్ల నాగ్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తున్నాయి. ఇక ఒక్కో కంటెస్టెంట్‌గా వెరైటీగా పరిచయం చేయడం ఇవన్నీ బాగున్నాయ్. ఒక్క మాటలో చెప్పాలంటే ఫస్ట్ డే మాత్రం కింగ్ కిర్రాక్ అనిపించాడని చెప్పుకోవచ్చు.

కాగా.. వాస్తవానికి కింగ్‌కు ఇలా షోలకు వ్యాఖ్యతగా, ప్రకటనలలో చేయడం పెద్ద కథేమీ కాదు. ఇదే మా టీవీలో ప్రసారమైన ‘మీలో కోటీశ్వరుడు’ ప్రోగ్రామ్ ఏ రేంజ్‌లో హిట్టయ్యి.. ఊహించని రీతిలో టీఆర్పీ రేటింగ్ సంపాదించి పెట్టిందో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఫస్ట్ డే ఓకే.. అయితే 100 రోజులు జరుగుతున్న ఈ షోను నాగ్ ఏ మాత్రం రక్తికట్టిస్తారో వేచి చూడాల్సిందే మరి.

Akkineni Nagarjuna Hit Or Fut As A biggbos-3 Host!:

Akkineni Nagarjuna Hit Or Fut As A biggbos-3 Host!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs