Advertisement
Google Ads BL

ఆ సినిమా స్టోరీ చెప్పేసిన ఉపరాష్ట్రపతి!


భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తాజాగా ఓ సినిమాని ఆసక్తిగా తిలకించారట. అది కూడా బాలీవుడ్ లో హృతిక్ రోషన్ నటించిన సూపర్ 30 సినిమాని వెంకయ్య నాయుడు ప్రత్యేకంగా క్యూబ్ ద్వారా తిలకించారట. అయితే తాజాగా వెంకయ్యనాయుడు గోరా శాస్త్రి శత జయంతి ఉత్సవాలు సందర్బంగా.... సీనియర్ జర్నలిస్ట్ లు ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన సూపర్ 30  సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. 

Advertisement
CJ Advs

అసలు సినిమాలు చూడడం మానేసిన తాను.. ఒక సినిమాని 2.30 గంటల పాటు ఎలా చూడగలనో అనుకున్నానని.. కానీ సూపర్ 30 సినిమాని చూస్తున్నంత సేపు తనకు చాలా బాగా అనిపించిందని చెబుతున్నారు. అంతేకాకుండా ఆ మాటల్లో మాటగా ఆయన సూపర్ 30 స్టోరీ మొత్తం మీడియాకి వివరించేయడం ఆసక్తిగా మారింది. హీరో 30మందిని దత్తత తీసుకుని వారికి చదువు చెప్పించటానికి పడ్డ కష్టం, కార్పొరేట్ విద్యా సంస్థలతో పోటి వంటి అంశాలు ఎంత ప్రాధాన్యత  ఉంటుందో ఈ సినిమాలో చూశామని చెప్పారు. మరి హృతిక్ రోషన్ నటించిన సూపర్ 30 గతవారమే విడుదలై భారీ కలెక్షన్స్ కొల్లగొట్టే దిశగా దూసుకుపోతుంది.

Venkaiah Naidu Tells Bollywood Movie Story:

Vice President Praises Super 30 Movie  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs