Advertisement
Google Ads BL

జబర్దస్త్ వినోదినిపై హత్యాయత్నం!


‘జబర్దస్త్’ టీవో షో ఆర్టిస్ట్ వినోద్‌ అలియాస్ వినోదినిపై దాడి జరిగింది. వినోద్ ఉంటున్న ఇంటి ఓనర్ జరిపిన దాడిలో వినోద్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ఓనర్‌- వినోద్ మధ్య ఏం జరిగిందో ఏమో తెలియరాలేదు. ఓనర్ చేసిన దాడిలో వినోద్ కుడి కంటి భాగంపై బాగా దెబ్బలు తగిలాయని ఫొటోలను బట్టి చూస్తే అర్థమవుతోంది. 

Advertisement
CJ Advs

ఈ ఘటనకు పాల్పడిన తన ఇంటి ఓనర్‌ను కఠినంగా శిక్షించాలని కాచిగూడ పోలీస్ స్టేషన్‌లో వినోద్ ఫిర్యాదు చేశాడు. వినోదిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఇంటి ఓనర్‌ను స్టేషన్‌కు పిలిపించుకుని విచారిస్తుస్తున్నట్లు సమాచారం.

అయితే ఈ గొడవ ఎందుకు జరిగింది..? ఓనర్ ఎందుకు చేయిచేసుకున్నారు..? ఏ విషయంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది..? అసలు ఈ గొడవకు కారకులెవరు..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. దాడిలో తీవ్రంగా గాయపడ్డ వినోద్‌ను చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వినోద్ కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

house owner attack on jabardasth vinodini:

house owner attack on jabardasth vinodini
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs