Advertisement
Google Ads BL

యంగ్ హీరోలు ఇక నభాని వదులుతారా?


నన్ను దోచుకుందువటే సినిమాలో సుధీర్ బాబు సరసన హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నభా నటేషాకి తెలుగులో ఓ అన్నంత ఆఫర్స్ మాత్రం రాలేదు. నన్ను దోచుకుందువటే సినిమాలో ట్రెడిషనల్ గా నటించిన నభా మీద పూరి జగన్నాధ్ కన్ను పడింది. రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నభాని వన్ ఆఫ్ ద హీరోయిన్ గా ఎంపిక చేసాడు. పూరి సినిమాల్లో హీరోయిన్స్ కి కూడా మంచి ప్రాధాన్యతే ఉంటుంది. ఈ సినిమాలో నభాకి మంచి  పాత్ర నిచ్చాడు పూరి. చాలా గ్లామర్ గా అంటే అందాల ఆరబోతలోనే కాదు.. మాస్ గర్ల్ గా నభా నటనని క్రిటిక్స్ కూడా కొనియాడుతున్నారు. 

Advertisement
CJ Advs

ఈ సినిమాలో రెండో హీరోయిన్ గా నటించిన నిధి అగర్వాల్ ను పెద్దగా స్క్రీన్ మీదకు తీసుకురావడానికి పూరికి కుదరలేదు. నిధి గ్లామర్ పరంగా నభా నటేషాతో పోటీపడిన.. నటనకు స్కోప్ లేకపోవడంతో.. నభా రెచ్చిపోయింది. నిధిని పక్కన బెట్టి పూరి అవసరం అయినపుడల్లా నభా నటేష్ నే నమ్ముకోవాల్సి వచ్చింది. రామ్ తో రొమాంటిక్ సన్నివేశాల్లోను నభా అస్సలు తగ్గలేదు. దర్శకుడు ఎలా చెబితే అలా అందాలు చూపించేసింది. అక్కడక్కడా నభా పాత్రకైతే గ్లామర్ డోసు కాస్త ఎక్కువైంది అని అనిపించకమానదు. గ్లామర్ పరంగా నిధి అగర్వాల్ కి ఏ మాత్రం తీసిపోకుండా నభా అందాలు ఆరబోసింది. కాకపోతే వరంగల్ అమ్మాయిగా నభా పాత్రని చూస్తే ఇరిటేట్ అనిపిస్తుంది. తెలంగాణ యాసతో నభా పాత్రకు రాసిన డైలాగులు మరీ కృత్రిమంగా ఉన్నాయి. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో చాందినిగా నభా నటన, ఆమె గ్లామర్ చూసిన యంగ్ హీరోలు ఆమెని ఓ చూపు చూస్తారనిపిస్తుంది.

Nabha Natesh Role Highlight in Ismart Shankar:

Good Response to Nabha Natesh Role in Ismart Shankar
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs