Advertisement
Google Ads BL

నిధికి మళ్లీ దెబ్బ పడినట్లేనా..?


అక్కినేని హీరోలతో వెలుగులోకి వచ్చిన బాలీవుడ్ పాప నిధి అగర్వాల్.. నాగ చైతన్య‌తో సవ్యసాచి సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైంది. ఆ సినిమాలో నిధి కాస్త ట్రెడిషనల్ గర్ల్ గా చైతు గర్ల్ ఫ్రెండ్ గా నటించింది. నిధి ఎంతగా ట్రెడిషన్ ట్రై చేసినా.... ఆమెలోని హాట్ యాంగిల్ మాత్రం ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంది. ఇక సవ్యసాచి విడుదల కాకుండానే తమ్ముడు అఖిల్ మిస్టర్ మజ్ను లో హీరోయిన్ గా అవకాశమిచ్చాడు. అయితే మిస్టర్ మజ్ను లో నిధి అగర్వాల్ నటన పర్వాలేదనిపించినా.. సినిమా ప్లాప్ కావడంతో నిధికి పేరు రాలేదు. ఆ సినిమాలో అఖిల్ ని ప్రేమించే, ద్వేషించే అమ్మాయిగా నిధి నటించింది. ఆ సినిమాలో ట్రెడిషనల్ గా అందాలు ఆరబోస్తూ గ్లామర్ పరంగాను మెప్పించింది. 

Advertisement
CJ Advs

ఇక రెండు సినిమాలు ప్లాప్ అయినా.. పూరి జగన్నాధ్, నిధి అగర్వాల్  అందాలకు ముగ్దుడై.. రామ్ తో చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నభా నటేష్‌తో పాటుగా మరో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ని ఎంపిక చేసాడు అయితే ఈ సినిమాలో మొదటినుండి నిధి అందాల ఆరబోత మాత్రం స్పెషల్ గా ఎట్రాక్టింగ్ గానే ఉంది.  ఇక ఇస్మార్ట్ శంకర్ లో సత్యదేవ్ లవర్ గా మెదడుకు సంబంధించిన రీసెర్చర్ గా కనిపించే పాత్రలో మెరిసింది. గ్లామర్ పరంగా నభాతో పోటీ పడిన నిధి అగర్వాల్ కి ఆమెకి వచ్చిన పేరు ఈ సినిమా ద్వారా రాలేదు. 

అసలు పూరి ఈ నిధి పాత్రకి పూర్తి అన్యాయం చేస్తూ బ్యాక్‌గ్రౌండ్‌ ప్రాపర్టీగా పరిమితం చేసాడు అని చెప్పాలి. ఇక పూరి డైరెక్షన్ లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ నిన్న శుక్రవారమే విడుదలైంది. మరి ఈ సినిమా ఫలితం, తన కేరెక్టర్ కున్న ప్రాధాన్యతను చూస్తుంటే పాపం నిధి పరిస్థితి అనిపిస్తుంది.

No Importance to Nidhi Agarwal role in Ismart Shankar:

Nabha Natesh Dominates Nidhi Agarwal in Ismart Shankar
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs