డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా ‘రైడ్’, ‘వీర’ చిత్రాల దర్శకుడు రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో ఎ హవీష్ లక్ష్మణ్ కొనేరు ప్రొడక్షన్ బ్యానర్‌పై కొనేరు సత్యనారాయణ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం ‘రాక్షసుడు’. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 2న విడుదల చేస్తున్నారు. గురువారం ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎ.ఎం.బి సినిమాస్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో...
నిర్మాత కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ - ‘‘ఏడాది క్రితం నేను, రమేష్ వర్మ కలసి చెన్నైలో ‘రాక్షసన్’ సినిమా చూశాం. చాలా నచ్చింది. ఏ స్టూడియోస్ సంస్థను స్థాపించిన తర్వాత తొలి సినిమాగా రాక్షసన్ సినిమాను రీమేక్ చేశాం. సినిమాను రీమేక్ చేశాం. హీరోగా ఎవరిని తీసుకోవాలని అనుకుని నలుగురైదుగురు పేర్లు అనుకున్నాం. చివరకు బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ను తీసుకున్నాం. తను పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అద్భుతంగా నటించాడు. ఇలాంటి థ్రిల్లర్ చిత్రాలను అందరికీ నచ్చేలా రీమేక్ చేయడం చాలా కష్టం. అయితే దర్శకుడు రమేశ్ వర్మ చాలా ఛాలెజింగ్‌గా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇంత భారీ స్థాయిలో ఎక్స్‌ట్రార్డినరీ విజువల్స్‌తో సినిమాను 90 రోజుల్లోనే పూర్తి చేశాం. చాలా రిచ్‌గా మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో సినిమాను నిర్మించాం. టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్‌కు కూడా ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తుంది. ఒక మంచి సినిమాను తీశామనే తృప్తి కలిగింది. సినిమా నచ్చిన అభిషేక్ నామాగారు ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఆయనకు మా టీమ్ తరపున థాంక్స్’’ అన్నారు.
అభిషేక్ పిక్చర్స్ అభిషేక్ నామా మాట్లాడుతూ - ‘‘తమిళంలో సినిమా చాలా పెద్ద హిట్. ఎంగేజింగ్ థ్రిల్లర్. సాయిశ్రీనివాస్ కెరీర్‌లో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. డైరెక్టర్‌గా సరికొత్త రమేశ్ వర్మను చూస్తారు. సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందని నమ్మకం ఉంది’’ అన్నారు.
చిత్ర దర్శకుడు రమేశ్ వర్మ మాట్లాడుతూ - ‘‘డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చిన కొనేరు సత్యనారాయణగారికి థాంక్స్. బెల్లంకొండ సురేశ్‌గారికి థాంక్స్. ఇక ఈ సినిమా జర్నీలో సపోర్ట్ చేసిన మా హీరో సాయిశ్రీనివాస్, అనుపమ, మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ సహా ప్రతి ఒక ఆర్టిస్ట్, టెక్నీషియన్‌కు థాంక్స్’’ అన్నారు.
హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ - ‘‘కవచం సినిమా సమయంలో రమేష్ వర్మ ఈ రీమేక్ గురించి చెప్పారు. మళ్లీ పోలీస్ ఆఫీసర్‌గానే నటించాలని అనుకుని ముందు ఆసక్తి చూపలేదు. కానీ తీరా సినిమా చూశాను. అద్భుతంగా అనిపించింది. ఇలాంటి సినిమాను మిస్ కాకూడదనిపించింది. అద్భుతమైన థ్రిల్లర్. కోనేరు సత్యనారాయణలాంటి నిర్మాత ఈ చిత్రానికి లభించడం అదృష్టం. నేను హీరోగా ఈ బ్యానర్ లో తొలి చిత్రం రావడం హ్యాపీ. రమేష్ వర్మతో సహా అందరూ చాలా కష్టపడ్డారు. మంచి సినిమా. అందరిలో అవేర్‌నెస్ క్రియేట్ చేస్తుంది’’ అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో నటుడు కాశీ విశ్వనాధ్, బేబీ దువా కౌశిక్, కెమెరా మెన్, వెంకట్ సి దిలీప్, ఎడిటర్ అమర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి రచన: సాగర్, ఆర్ట్: గాంధీ నడికొడికర్, కెమెరా: వెంకట్ సి.దిలీప్, సంగీతం: జిబ్రాన్, నిర్మాత: సత్యనారాయణ కొనేరు, దర్శకత్వం: రమేష్ వర్మ పెన్మత్స.