Advertisement
Google Ads BL

ప్రాధాన్యత తగ్గితే నాని ఊరుకుంటాడా?


నానిని, ఇంద్రగంటి మోహన కృష్ణ అష్టాచమ్మాతో హీరోని చేసాడు. నాని ఒకే ఒక్క సినిమాతో హీరోగా నేచురల్ స్టార్ అవతారమెత్తాడు. మధ్యలో మాస్ వెంటబడిన నాని ప్లాప్స్ లో కొట్టుకుపోయాడు. కానీ గత కొన్నేళ్లుగా కథల ఎంపికలో నాని చూపిస్తున్న వేరియేషన్స్ తో నాని వరస హిట్స్ అందుకున్నాడు. ఎంతో ఇష్టపడి చేసిన కృష్ణార్జున యుద్ధం ఫలితం తారుమారవడం, జెర్సీ సినిమాకి బ్లాక్ బస్టర్ టాకొచ్చినా.. కలెక్షన్స్ రాకపోవడంతో.. ఇప్పుడు నాని తన తదుపరి చిత్రాలు మీద స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది.

Advertisement
CJ Advs

విక్రమ్ కుమార్ తో గ్యాంగ్ లీడర్ సినిమా చేస్తున్న నాని ఆ సినిమాని ఆగష్టు 30 న విడుదల చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. విక్రమ్ కుమార్ గ్యాంగ్ లీడర్ షూటింగ్ కూడా చివరి దశలో ఉంది. ఇక నాని మొదటిసారిగా ఫుల్ లెన్త్ విలన్ రోల్ చెయ్యబోతున్నాడు. అది కూడా తనకి లైఫ్ ఇచ్చిన ఇంద్రగంటి మోహనకృష్ణ ‘వి’ సినిమాలో. సుధీర్ బాబు హీరోగా అదితి రావు, నివేత థామస్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నఈ సినిమాలో నాని విలన్ రోల్ చెయ్యబోతున్నాడు. మొదట్లో గెస్ట్ రోల్ అన్నప్పటికీ. సినిమా మొత్తం నాని రోల్ ఉండబోతుంది. అయితే ఈ సినిమా కొంతమేర షూటింగ్ జరిగిన తర్వాత తన సీన్స్ కన్నా ఎక్కువగా సుధీర్ బాబు సీన్స్ సినిమాలో హైలెట్ అనేలా అనిపించడంతో... నాని ‘వి’ సినిమా షూటింగ్ అపి మరీ ఇంద్రగంటి మోహనకృష్ణ తో స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయమని సూచించాడట. మరి విలన్ గా చేసినా కూడా ఆ పాత్ర కి ఎంత ప్రాధాన్యత లేకపోతే నాని ఒప్పుకున్నాడో అన్నారు. మరి తన పాత్రకి ప్రాధాన్యత తగ్గితే ఓ సక్సెస్ ఫుల్ హీరో ఊరుకుంటాడా.. అందుకే తనకి లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ కే నాని పాటలు చెబుతున్నాడు.

Nani Fingering In V Movie Story :

Nani Suggestions to Mohan Krishna Indraganti
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs