శుక్రవారం వస్తే చాలు తెలుగు రాష్ట్రాల్లో సినిమాల పండుగే పండుగ. ప్రతీ శుక్రవారం ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతుంటాయో.. ఎన్ని సినిమాలకు థియేటర్లలో ప్రేక్షకులు లేక వెలవెలబోతాయో ఆ కష్టాలను దగ్గర్నుంచి చూసిన వారికి మాత్రమే తెలుస్తాయ్. అయితే ఈ శుక్రవారం అనగా జులై 19న అమలాపాల్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఆమె’.. విక్రమ్ హీరోగా నటించిన ‘మిస్టర్ కేకే’ రెండు సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి.
ఇద్దరూ ఇద్దరే.. రెండు డిఫరెంట్ కథలే.. అంతే కాదండోయ్ రెండు డబ్బింగ్ సినిమాలే కావడం గమనార్హం. ఇప్పటికే ఈ సినిమాల ప్రమోషన్‌లు గట్టిగానే చేసుకున్నారు కూడా. ఇద్దరూ కూడా తెలుగులో చాలా రోజుల తర్వాత నటించి అభిమానులు, సినీ ప్రియుల ముందుకొస్తున్నారు. ఒక్క మాటలో హిట్ అనేది ఈ ఇద్దరికీ ఈ టైమ్‌లో చాలా అవసరం.
అయితే ఈ తరం అమ్మాయిల జీవిత చిత్రాన్ని తలపించేలా వస్తున్న ‘ఆమె’ను ఆదరిస్తారా..? లేకుంటే ‘మిస్టర్ కేకే’ను ఆదరిస్తారా..? అనేది ఇప్పుడు అమలాపాల్, విక్రమ్‌ను వెంటాడుతున్న ప్రశ్న. అంతేకాదు.. అమలా ప్రధాన పాత్రలో రూపొందిన ‘ఆమె’లో న్యూడ్ షో కీలకం. ఈ సీన్స్‌కు జనాలు అట్రాక్ట్ అయి థియేటర్లకు క్యూ కడతారా..?.. లేకుంటే పవర్ ప్యాక్‌డ్ యాక్షన్ మూవీతో వస్తున్న మిస్టర్‌ను ఆదరిస్తారో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే మరి.