Advertisement
Google Ads BL

జగ్గూభాయ్‌ను తీసేశారా..? బయటికొచ్చేశారా!?


సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇప్పటికే రెండు లుక్స్, నేమ్‌తో రివీల్ మహేశ్ అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. అయితే ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారన్న దానిపై దాదాపు క్లారిటీ వచ్చేసినట్లే. గత రెండ్రోజులుగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త అటు సోషల్ మీడియాలో ఇటు వెబ్‌సైట్లలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.

Advertisement
CJ Advs

అలనాటి హీరో నేటి విలన్ జగపతి బాబు అలియాస్ జగ్గూభాయ్ ఈ సినిమా నుంచి అవుట్ అయ్యాడట. అయితే ఈ సినిమా నుంచి ఆయనంతకు ఆయనే బయటికొచ్చేశాడా..? లేకుంటే డైరెక్టరే తీసేశారా..? అనేది మాత్రం తెలియరాలేదు కానీ పుకార్లు మాత్రం రకరకాలుగా వస్తున్నాయి. వాస్తవానికి మ‌హేష్ బాబుతో జగ్గుభాయ్‌కు మంచి సంబంధాలున్నాయ్.. ఇందుకు ‘శ్రీమంతుడు’, ‘మహర్షి’ సినిమాలే సాక్ష్యం.

వాస్తవానికి జగ్గుభాయ్‌కు షూటింగ్ ముందు చెప్పిన కథకు.. షూటింగ్ షురూ అయిన తర్వాత ఉండే కథకు చాలా వ్యత్యాసం ఉందట. అయితే స్టోరీ ఇలా మార్చేస్తే పరిస్థితేంటి..? అని ప్రశ్నించింనందుకు గాను ఆయన్ను తీసేయాలనే యోచనలో చిత్రబృందం ఉన్నప్పుడే.. ముందే పసిగట్టిన జగపతి.. తాను ఈ సినిమాలో చేయట్లేదని ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేసి బయటికొచ్చేశాడని తెలుస్తోంది. కాగా జగ్గుభాయ్ స్థానంలో ప్రకాష్ రాజ్‌ను తీసుకున్నారట. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో సీనియర్‌ నటి విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్న విషయం విదితమే.

Jagapathi Babu not part of Mahesh Babu’s ‘Sarileru Neekevvaru’:

Jagapathi Babu not part of Mahesh Babu’s ‘Sarileru Neekevvaru’
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs