ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోలందరిని చుట్టేస్తున్న భామ పూజా హెగ్డే. ఆమె కెరీర్‌లో ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ లేకపోయినా... లక్కున్న హీరోయిన్ గా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ కెరీర్‌లో దున్నేస్తుంది. ఒక్క స్టార్ హీరో ఏం ఖర్మ.. తెలుగులో రామ్ చరణ్ (అతనితో కూడా ఐటం సాంగ్ వేసుకుందనుకోండి) తప్ప మిగతా హీరోలందరితో పూజ నటించేస్తుంది. ఎన్టీఆర్, మహేష్ తో జోడి కట్టిన పూజ తాజాగా ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్తో బిజీగా వుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజున్న ఏకైన హీరోయిన్‌గా పూజా హెగ్డే నే కనబడుతుంది. మరి అలాంటి హీరోయిన్ ఏ సినిమాలో నటించినా ఆ సినిమాకి బోలెడంత క్రేజ్ వస్తుంది.
ఆ ఉద్దేశ్యంతోనే డీజే లో అల్లు అర్జున్ సరసన పూజని నటింపజేసిన దర్శకుడు హరీష్ శంకర్.. వరుణ్ తేజ్ వాల్మికీలో ఓ స్పెషల్ కేరెక్టర్ కి పూజ ని అడిగాడు. మరి డీజే తో లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ గనక పూజ కూడా వాల్మీకి సినిమాలో వరుణ్ తేజ్ సరసన చెయ్యడానికి ఒప్పుకుంది. అయితే పూజా భారీ పారితోషకం డిమాండ్ చేసిందనే టాక్ ఎప్పటినుండో ప్రచారంలో ఉంది. ప్రచారం జరిగినట్టుగానే వాల్మికీలో ఓ పాట.. కొన్ని సీన్స్ కోసం పది రోజుల కాల్షీట్స్‌ని హరీష్ శంకర్‌కి కేటాయించిన పూజ.. ఆ పది రోజుల కాల్షీట్స్ కోసం కోటిన్నర డిమాండ్ చేసిందట. మరి క్రేజున్న హీరోయిన్.. అందులోనూ స్టార్ హీరోలతో బిజీగా ఉన్న పాప గనక వాల్మీకి నిర్మాతలు కూడా పూజా అడిగింది కాదనకుండా సమకూరుస్తున్నారట. అది కదా లెక్క... నిజంగా పూజా టైం అలా నడుస్తుంది అంతే..!