Advertisement
Google Ads BL

‘సాహో’ వాయిదా.. అందుకే ధైర్యం చేస్తున్నారు


అనుకున్నదంతా అయ్యింది. సాహో సినిమా ఆగష్టు 15 నుండి పోస్ట్ పోన్ అయ్యింది. షూటింగ్ పూర్తయినదని.. గుమ్మడికాయ కొట్టేసిన సాహో టీం ఓ సెల్ఫీతో ఆ విషయాన్నీ తెలిపింది. ఇక విడుదలకు ఖచ్చితంగా నెల టైమ్ ఉంది. కానీ గ్రాఫిక్స్ పనులు ఒక నెలలో పూర్తి చెయ్యడం పెద్ద సాహసం, అలాగే ఇండియా వైడ్ గా విడుదల చేస్తున్న సాహో సినిమా ప్రమోషన్స్ కి ఈ నెల సరిపోదు. అందుకే సాహో సినిమాని అధికారికంగా పోస్ట్ పోన్ చేసింది సాహో టీం. ఎలాగూ బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ మిషన్ మంగళ్ కూడా ఆగష్టు 15 కే రాబోతుంది. అక్షయ్ ఇప్పటికే ప్రమోషన్స్ తో దూసుకుపోతున్నాడు. ఇక సాహో హడావిడి ఇంకా పక్కాగా మొదలవ్వలేదు. అందుకే హడావిడిగా అయినా సాహో పోస్ట్ ప్రొడక్షన్స్ తో పాటుగా విజువల్‌ ఎఫెక్ట్స్‌ పనులు పూర్తి కాలేదు.. కాబట్టి పోస్ట్ పోన్ చేశారు.. కానీ మరో డేట్ మాత్రం ఇంకా లాక్ చెయ్యలేదు.

Advertisement
CJ Advs

ఇక ప్రభాస్ సాహో అలా పోస్ట్ పోన్ అయ్యిందో లేదో.. ఇలా అడవి శేష్ ఎవరు సినిమాని, శర్వానంద్ రణరంగం సినిమాని ఆగష్టు 15 న విడుదల చేస్తున్నామంటూ ఒకరు మీద ఒకరు తమ తమ సినిమాల రిలీజ్ డేట్స్ ని ప్రకటించేశారు.  క్షణం, గూఢచారి సినిమాలతో హీరోగా పేరుతెచ్చుకున్న అడవి శేష్ ఎవరు సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఇక శర్వానంద్ - సుధీర్ వర్మ కాంబోలో తెరకెక్కుతున్న రణరంగం సినిమా మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి. అయితే సాహో సినిమా వలన ఎవరు బయ్యర్లు ఎవరు సినిమాని ఆగష్టు నుండి సెప్టెంబర్ కి పోస్ట్ పోన్ చెయ్యమని నిర్మాతల మీద ఒత్తిడి తీసుకొచ్చారు. 

కానీ సాహో విడుదల డేట్ మారడంతో ఎవరు సినిమా ఆగష్టు 15 కి కర్చీఫ్ వేసేసింది. ఇక ఎప్పటి నుండో షూటింగ్ జరుపుకుంటున్న రణరంగం సినిమా కూడా సాహో పోస్ట్ పోన్ అవడంతో హడావిడిగా  ఆగష్టు 15 డేట్ వాడేసుకోవడానికి డిసైడ్ అయ్యింది. ఒక్క పెద్ద సినిమా వాయిదా.. అనేక సినిమాలకు ధైర్యాన్నిచ్చింది.

Saaho Movie Release Postponed:

Sharwanand and Adivi Sesh Takes Saaho Release Date
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs