మరి కుళ్ళుకోరా... పెళ్లి చేసుకున్నాక కూడా సక్సెస్ ఫుల్ గా కెరీర్ లో దూసుకుపోతున్న సామ్ ని చూస్తే ఎవరికైనా కళ్ళుకుట్టేస్తాయి. సామ్ తో పాటు ఇండస్ట్రీలోకొచ్చిన హీరోయిన్స్ చాలామంది ఇప్పుడు కెరీర్ లో బాగా వెనకబడిపోయారు. ఇక కొంతమంది హీరోయిన్స్ రెండు మూడు సినిమాల్లో హిట్ కొట్టినా.. తరువాత వచ్చిన ప్లాప్స్ తో సినిమాలకు, కెరీర్ కి దూరమవుతున్నారు. కానీ సామ్ మాత్రం పెళ్ళికి ముందు తర్వాత అంటూ కెరీర్ లో దూసుకుపోతుంది. యు టర్న్ సినిమాని ఎంతో ధైర్యం చేసి తీసింది. సమంతకి ఆ సినిమా హిట్ టాక్ పడినా.. కలెక్షన్స్ రాకపోవడం చూసి సమంత వల్ల కాదు.. ఎవరైనా టాప్ హీరోలతో నటిస్తే సమంత ఇంకా సక్సెస్ అవుతుంది అన్నారు.
కానీ ఈ ఏడాది మజిలీ, సూపర్ డీలక్స్ నిన్నగాక మొన్న ఓ బేబీ సినిమాల హిట్స్ తో సమంత రేంజ్ మరింత పెరిగిపోయింది. మజిలీ సినిమాతో పాటుగా, ఓ బేబీ సినిమా కూడా సమంత క్రేజ్ తోనే ఇరగదీశాయి. ఓ బేబీ సినిమా అయితే తన భర్త నాగ చైతన్య సినిమాల కలెక్షన్స్ ని కూడా క్రాస్ చేసేసింది. ఒక్క వారం తిరిగేలోపే బ్రేక్ ఈవెన్ సాధించిన ఓ బేబీ రెండో వారంలోను దూసుకుపోతుంది. ఓ బేబీలో సమంత నటన చూసి చాలామంది హీరోయిన్స్ ఈర్ష్య పడుతున్నారంటే నమ్మాలి. తానూ ఎంతో నమ్మి కొరియన్ మూవీని రీమేక్ చేసిన సామ్ ఓ బేబీతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లోను సమంత సత్తా చాటింది.
ఇక ఈ వారం విడుదలైన నిను వీడని నీడని నేనే కాస్త మంచి టాక్ తెచ్చుకున్నా.. మిగతా దొరసాని యావరేజ్ తోనూ, రాజ్ దూత్ అట్టర్ ప్లాప్ టాక్ రావడంతో ఓ బేబీకి రెండో వారం కూడా కలిసొచ్చి మంచి కలెక్షన్స్ కొల్లగొడుతుంది. మరి సమంతకొచ్చిన ఈ రేంజ్ క్రేజ్ చూసిన మిగతా హీరోయిన్స్ కి కళ్ళు కుట్టవా...!